18.5 C
London
Friday, October 9, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ గాంధీజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

గాంధీజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

0
  • ఆయన ఆశయాలను ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి
  • సత్యం, అహింస, శాంతి మార్గాల్లో సమాజం ముందుకు సాగాలి

              జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ:

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి(Gandhi Jayanti) సందర్భంగా జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి (Mla Palla Rajeswer Reddy)గాంధీజీ సేవలను, దేశ స్వాతం త్ర్య సాధన కోసం ఆయన చేసిన పోరాటాన్ని, త్యాగాలను స్మరించుకున్నారు. దేశానికి గాంధీజీ అందిం చిన సేవలు, ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తి దాయకం.

మహాత్మా గాంధీ ప్రపంచానికి సత్యం, అహింస, శాంతి, సహనం, సౌభ్రా తృత్వం వంటి గొప్ప విలువలను అందిం చారు. అహింసా మార్గంలో ప్రజలను ఏకం చేసి స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపిన గాంధీజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం.

గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలి. ప్రజల్లో సేవాభావం, సామాజిక బాధ్యత, దేశభక్తి మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది.

గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. గాంధీజీ ఆశయాలను కేవలం జయం తి సందర్భంగా స్మరించుకోవ డం కాకుండా, వాటిని నిత్య జీవితంలో ఆచరించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here