18 C
London
Monday, August 31, 2026
Home భక్తి వెల్దండ గ్రామంలో ఘనంగా దుర్గమ్మ పండుగ వేడుకలు

వెల్దండ గ్రామంలో ఘనంగా దుర్గమ్మ పండుగ వేడుకలు

0
  • భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

నర్మెట్ట:

నర్మెట మండలం వెల్దండ గ్రామంలో(VELDANDA VILLAGE) నిర్వహించిన దుర్గమ్మ పండుగ వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గ్రామానికి విచ్చేసి దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా దుర్గమ్మ పండుగ సందర్భంగా గ్రామం  లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతిని ధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం కట్టుబడి ఉన్నా నని ఆయన హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షే మానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here