15.2 C
London
Monday, June 1, 2026
Home ప్రజా సమస్యలు జనగామ కలెక్టర్ తీరుపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు

జనగామ కలెక్టర్ తీరుపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు

0
  • బాధితుల కమిటీ ఎమ్మెల్యేకు మెమోరాండం..
  • సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ:

జనగామలో జిల్లా కలెక్టర్ వ్యవహార శైలిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి(Janagaon Mla )కలెక్టర్ బాధితుల రక్షణ కమిటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి జనగామ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

ప్రజా సమస్యలు పెరిగాయి:

జిల్లా కలెక్టర్ తీరు వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవు తున్నాయని, ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన అధికారే సమస్యగా మారారని కమిటీ సభ్యులు ఆరోపించారు. ముఖ్యంగా ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు మట్టి అందక పనులు నిలిచిపోతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇతర గృహ నిర్మాణా  లు కూడా నిలిచిపోయే పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు.

మట్టి కొరతతో నిర్మాణ పనులకు ఆటంకం:

ప్రభుత్వ అవసరాలకు, ప్రజల అవసరాలకు మొరం మట్టి కూడా దొరక డం లేదని, జేసీబీ, లారీ, ట్రాక్టర్ యజమాను లపై భారీ జరిమానాలు విధించడం వల్ల వారు ఆర్థికంగా నష్టపోతున్నారని కమిటీ వివరించింది. మూడు నెలలుగా వాహన యజమానులు అప్పుల వాయిదాలు చెల్లించలేని పరిస్థితి వచ్చిందని తెలిపింది.

ఆంక్షలపై కూడా ఫిర్యాదు:

సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజలు, ప్రజాప్రతిని ధులు, అధికారులు వెళ్లినా కఠిన తనిఖీలు నిర్వహిస్తున్నా రని, ఇతర జిల్లాల్లో లేని ఆంక్షలు జనగామలో అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలను రాష్ట్ర ప్రభు  త్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేను కోరారు.

మంత్రి పొంగులేటికి రాతపూర్వకంగా ఫిర్యాదు: ఎమ్మెల్యే పల్లా

ఈ సమస్యలు ఇప్పటికే తన దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కమిటీ ద్వారా మరిన్ని అంశాలు తెలిసాయని, అన్ని విషయాలను మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రాతపూర్వకంగా ఫిర్యా దు చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ బాధితుల రక్షణ కమిటీ చేపట్టే ప్రతి కార్యక్రమానికి తన మద్దతు ఉంటుంద ని, పార్టీ శ్రేణులు కూడా భాగస్వాములు అవుతాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ సాదిక్ అలీ, సహ కన్వీనర్ బోట్ల శేఖర్‌తో పాటు పలువురు నాయ కులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here