17.4 C
London
Thursday, July 16, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ ప్రమాదంలో గాయపడిన బాలుడిని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా

ప్రమాదంలో గాయపడిన బాలుడిని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా

0
  • గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాహుల్‌ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన పల్లా 
  • మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన ఎమ్మెల్యే 

హైదరాబాద్:

జనగామ నియోజకవర్గం ధూల్మిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు సిరిగిరి కనకయ్య కుమా రుడు సిరిగిరి రాహుల్ (16) రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయ  పడగా, సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో (Secunder abad Gandhi Hospital) చికిత్స పొందుతున్నారు. విష  యం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం ఆసుపత్రికి వెళ్లి రాహుల్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

అదే సమయంలో జనగామ పట్టణం 5వ వార్డుకు చెందిన జహంగీర్ చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయనను కూడా పరా మర్శించారు. జహంగీర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here