- విద్యారంగానికి ప్రభాకర్ రెడ్డి సేవలు అభినందనీయం
- విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన అధ్యాపకుల సేవలు చిరస్మరణీయం
- డాక్టర్ జి. ప్రభాకర్ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్:
రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని CLR జడ్పీహెచ్ఎస్ పాఠ శాలలో ఆదివారం నిర్వహించిన డాక్టర్ జి. ప్రభాకర్ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (Jangaon MLA Dr. Palla Rajeshwar Reddy was the chief guest at the retirement ceremony of Dr. G. Prabhakar Reddy)హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందుతున్న డాక్టర్ జి. ప్రభాకర్ రెడ్డి దంపతులను ఎమ్మె ల్యే అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లా డుతూ…
- విద్యారంగంలో సుదీర్ఘకాలం సేవలందిస్తూ..రాజకీయ శాస్త్రంలో ప్రొఫెసర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చు కున్న డాక్టర్ జి. ప్రభాకర్ రెడ్డి సేవలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా కొనియాడారు.
- ఒక ఉద్యోగి తన జీవితంలో ఎన్నో సంవత్సరాలు బాధ్య తగా విధులు నిర్వర్తించి, సమాజానికి తన వంతు సేవ అందించిన అనంతరం ఉద్యోగ విరమణ పొందడం ఒక ముఖ్యమైన ఘట్టమని పేర్కొన్నారు.
- ఉద్యోగ విరమణ అనేది సేవలకు ముగింపు కాదు. ఒక కొత్త జీవన ప్రయాణానికి శ్రీకారం చుట్టే సందర్భమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
- విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తూ, వారి భవిష్యత్తుకు బాట లు వేసిన ఉపాధ్యాయులు, అధ్యాపకుల సేవలు సమాజం లో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపో తాయని పేర్కొన్నారు.
- డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తన వృత్తి జీవితంలో నిబద్ధతతో పని చేస్తూ విద్యార్థుల అభివృద్ధికి, విద్యారంగానికి అందించిన సేవలు అభినందనీయమన్నారు.
- అనంతరం ఉద్యోగ విరమణ పొందుతున్న డాక్టర్ జి. ప్రభా కర్ రెడ్డి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి శుభా కాంక్షలు తెలిపారు. ఉద్యోగ బాధ్యతల నుంచి విముక్తి పొందిన అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ మరింత కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

















