- సెప్టెంబర్ చివరి నాటికి మోటార్ల ఏర్పాటు పూర్తి చేస్తాం
- ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో రాజకీయాలకు తావులేదు
- అర్హత, పేదరికమే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక
- ఇందిరమ్మ ఇళ్ల కోసం లంచం అడిగితే వెంటనే సమాచారం ఇవ్వండి
- ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా
- గ్రామాభివృద్ధికి నిధుల కొరత లేకుండా కృషి చేస్తా
- బొంతగట్టు నాగారంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
తరిగొప్పుల:
తరిగొప్పుల మండలంలోని బొంతగట్టు నాగారం గ్రామంలో వీఓ భవనం, అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి చేపట్టనున్న అభివృద్ధి పనులకు(Development works to be under taken for the construction of VO building and Anganwadi building) సోమవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు.
ఎమ్మెల్యే పల్లా మీడియా పాయింట్స్:
- రూ.22 లక్షల అంచనా వ్యయంతో వీఓ భవనం, అంగన్ వాడీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.
- గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తాను.
- స్థానిక సర్పంచ్ మల్లన్న, పాలకవర్గం పట్టుదలతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నా రు.
- గ్రామానికి అవసరమైన రోడ్ల నిర్మాణంతో పాటు ఇతర అభి వృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
- గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వ యంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
- ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో రాజకీయాలకు తావులేకుండా అర్హత, పేదరికం ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు.
- అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా అధికా రులు చర్యలు తీసుకోవాలని కోరారు.
- ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎవరూ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వవద్దని గ్రామస్తులకు సూచించారు.
- ఎవరైనా లంచం అడిగితే వెంటనే తన దృష్టికి తీసుకు రావాలని కోరారు.
- ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్నప్పటికీ చెరువుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరలేదని ఎమ్మెల్యే తెలిపారు.
- రాబోయే రోజుల్లో వర్షాలు కురవకపోతే వరి పంటకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
- దేవాదుల ప్రాజెక్టు పనులపై సంబంధిత ఎస్‌ఈ, కాంట్రాక్ట ర్లతో ఇప్పటికే మాట్లాడినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
- దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన పైప్‌లైన్ పనులు దాదా పు పూర్తయ్యాయి. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేస్తు న్నామని చెప్పారు.
- సెప్టెంబర్ చివరి వారం నాటికి మోటార్ల ఏర్పాటు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎమ్మెల్యే వెల్లడించా రు.
- మోటార్ల నిర్వహణకు అవసరమైన విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను కూడా వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
- అన్నీ అనుకున్న విధంగా జరిగితే అక్టోబర్ 15 నుంచి 20 తేదీల మధ్య, దసరా పండుగ నాటికి సాగునీరు అందించేం దుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
- సాగునీరు అందుబాటులోకి వస్తే ప్రస్తుత పంటకు చివరి రెండు మూడు తడులతో పాటు రాబోయే యాసంగి పంట కు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
- ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అందుబాటులో ఉంటూ తన శక్తివంచన లేకుండా సేవలందిస్తున్నాను.
- పేద ప్రజలకు ఉచిత వైద్య సహాయం అందించేందుకు నిరం తరం కృషి చేస్తున్నాం.
- ప్రభుత్వం నుంచి గ్రామాలకు రావాల్సిన అభివృద్ధి పనులు, నిధుల కోసం నిరంతరం పోరాడుతున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
- ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి తప్ప తనకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు.
- బొంతగట్టు నాగారం గ్రామానికి రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
- గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు.

















