- ప్రజా సమస్యలు గాలికి..ఢిల్లీ చుట్టూ తిరుగుతారు
- కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ రిబ్బన్ కట్ చేస్తోంది
- ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు కేసులు, అరెస్టులు
- జనగామలో కేసులు, అరెస్టులే మిగిలాయి
- 22A పేరుతో ప్రజల భూములను ఇబ్బందులకు గురిచేస్తున్నారు
- తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
జనగామ:
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Former Minister Talasani Srinivas Yadav)తీవ్రంగా విమర్శించారు. ప్రజాపాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం..గడిచిన పరిపాలన కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ పూర్తిస్థాయిలో అమలు చేయలేద ని ఆరోపించారు. శుక్రవారం జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా పాయింట్స్:
- కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు నిరంతరాయంగా అందించిన తాగునీరు, విద్యుత్ సరఫరా ప్రస్తుతం ఎందుకు సక్రమంగా అందడం లేదో ప్రజలకు తెలుసు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కళ్యాణలక్ష్మి, షాదీము బారక్తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది.
- రైతులకు క్వింటాల్ వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తా మని ఇచ్చిన హామీ ఏమైందని తలసాని ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ అర్హులైన రైతులందరికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు.
- ప్రస్తుతం యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. దుకాణాల్లో యూరియా లభించక యాప్‌ల లో కొనుగోలు చేయాలని చెప్పడం ద్వారా ప్రభుత్వం కాల యాపన చేస్తోందని విమర్శించారు.
- పరిపాలనపై దృష్టి పెట్టకుండా ఢిల్లీ చుట్టూ తిరుగుతూ నాయకుల వద్ద పంచాయతీలు పెట్టుకోవడానికే ప్రభుత్వం పరిమితమైంది. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
- ఇటీవల ప్రారంభించిన ఫ్లైఓవర్‌తో పాటు అనేక అభివృద్ధి పనులకు కేసీఆర్ హయాంలోనే శంకుస్థాపనలు జరిగాయి. అప్పట్లో కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించిన ప్రాజెక్టులకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రిబ్బన్ కట్ చేసి తమ ఖాతాలో వేసుకుంటోందని విమర్శించారు.
- ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు, సమగ్ర కలెక్టరేట్ కార్యాల యాల నిర్మాణం వంటి కార్యక్రమాలు కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.
- హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాలతో పోటీపడి తెలంగా ణను దేశంలోనే ధాన్య ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందించి పంటలు పండిస్తే, ప్రస్తుతం నీళ్లు లేకుండానే పంటలు పండుతున్నాయంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
- కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేసిం దని గుర్తుచేశారు. రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే వారం రోజుల్లోనే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయం అందే విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు.
- కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆడపిల్లల వివాహాలకు రూ.1,00,116 ఆర్థిక సాయం అందించి పేద కుటుంబాలకు కేసీఆ ర్ ప్రభుత్వం అండగా నిలిచింది. గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచ డంతో పాటు విదేశీ విద్య కోసం స్కాలర్షిప్లు అందించామని చెప్పారు.
- హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకున్నామని, విద్యార్థుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సహా అన్ని వర్గాల సంక్షే మం, అభివృద్ధికి కేసీఆర్ కృషి చేశారని వివరించారు.
- తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1956, 1969, 1972లో జరిగిన ఉద్యమాలను గుర్తుచేశారు. 1969 ఉద్యమంలో 300 మందికి పైగా ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. తెలంగాణ కోసం రాజకీయ పదవు లను సైతం త్యాగం చేసి 2001లో కేసీఆర్ మళ్లీ ఉద్యమానికి నాంది పలికారని తెలిపారు.
- సుదీర్ఘ పోరాటం అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అనంతరం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 10 జిల్లాల నుంచి 33 జిల్లాలకు వికేంద్రీకరించిందన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ, సాగు నీరు, తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలను విస్తరించిందని చెప్పారు.
- జనగామ ప్రాంతంలో కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్ర తినిధులు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై దౌర్జన్యంగా కేసులు పెట్టి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని హరిస్తూ ప్రతిపక్ష గొంతును అణచివేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
- జనగామ నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కేవలం దౌర్జన్యాలు, కేసులు, అరెస్టు లకే ప్రభుత్వం పరిమితమైందని విమర్శించారు.
- 22A నిబంధనల పేరుతో ప్రజల సొంత ఆస్తులు, తాతము త్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయిం బర్స్మెంట్, పాలిటెక్నిక్ విద్యా ర్థుల స్కాలర్షిప్లు, రైతుబీమా వంటి సంక్షేమ కార్యక్ర మాల అమలుపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పా లని డిమాండ్ చేశారు.
- తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. కేసీఆర్ నాయకత్వం, ఆయన పాలన తెలంగాణకు శ్రీరామరక్ష వంటిదని పేర్కొన్నారు.

















