18.5 C
London
Friday, October 9, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ శ్రీకృష్ణుడి బోధనలు పిల్లలందరూ తెలుసుకోవాలి

శ్రీకృష్ణుడి బోధనలు పిల్లలందరూ తెలుసుకోవాలి

0

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి  

జనగామ:

జనగామ పట్టణ కేంద్రంలోని గీతాశ్రమం ఆధ్వర్యంలో నిర్వ హించిన శ్రీకృష్ణాష్టమి వేడుకలకు శుక్రవారం జనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(Janagama MLA Palla Rajesh war Reddy attended the Sri Krishnashtami celeb ratilons organized by Geethashram on Friday) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి వేషధారణలో వచ్చిన చిన్నారుల తో ఎమ్మెల్యే ఆత్మీయంగా ముచ్చటించారు. చిన్నారుల యోగక్షేమాలను అడిగి తెలు సుకోవడంతో పాటు, వారి చదువుల గురించి ఆరా తీశారు. చిన్నారులతో సరదాగా మాట్లాడి వారిని ఉత్సాహపరిచా రు. శ్రీకృష్ణుడి వేషధార ణలో ఉన్న చిన్నారులను చూసి సంతోషం వ్యక్తం చేస్తూ వారిని ఆశీర్వదించారు.

అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…

  • శ్రీకృష్ణాష్టమి వేడుకలను గీతాశ్రమం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా అత్యంత అద్భు తంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. వేడుక లను ఘనంగా నిర్వహించిన గీతాశ్రమం నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
  • శ్రీకృష్ణ భగవానుడు అందించిన బోధనలు, భగవద్గీత సందేశాలను చిన్నారులు విని, చదివి, తెలుసుకోవాలని సూచించారు. శ్రీకృష్ణుడు చూపిన సన్మార్గాన్ని జీవితంలో పాటిస్తూ ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.
  • శ్రీకృష్ణాష్టమి పర్వదినం చిన్నారుల్లో ఆధ్యాత్మిక విలువలు, మంచి ఆలోచనలు, నైతికతను పెంపొందించేందుకు దోహ దపడుతుందన్నా రు..ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడి బోధనలను ఆదర్శంగా తీసుకుని సత్యం, ధర్మం, నీతి మార్గంలో నడవాలని సూచించారు.
  • అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రతి ఒక్కరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here