15.6 C
London
Sunday, October 11, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ మహబూబాబాద్ జిల్లా జోలికొస్తే ఊరుకునేది లేదు..!

మహబూబాబాద్ జిల్లా జోలికొస్తే ఊరుకునేది లేదు..!

0
  •  బీఆర్ఎస్ హయాంలోనే మహబూబాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి
  •  జిల్లా సాధన కోసం ప్రజలు పెద్దఎత్తున ఉద్యమాలు చేశారు
  •  ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రతిఘటిస్తాం
  •  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలి
  •  అర్హులైన ప్రతి పట్టభద్రుడి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయించాలి
  •  గ్రామస్థాయిలో ఓటరు నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలి
  •  వర్గ విభేదాలను పక్కనపెట్టి సమష్టిగా పనిచేయాలి
  •  పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలి

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

మహబూబాబాద్:

మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఏర్పడి పదేళ్లు పూర్తయిన సంద ర్బంగా జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా ఆవిర్భావ దినో త్సవ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి వేడుకలు జరిపారు. అనంతరం అంబే ద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విధంగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) మాజీ ఎంపీలు కవిత, వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాయింట్లు:

  •  గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహబూబాబాద్ జిల్లాలో సమగ్ర అభివృద్ధికి కృషి చేశాం.
  •  జిల్లా కేంద్రం ఏర్పాటు, సమీకృత కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజీ, మెడికల్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీ, హార్టికల్చర్ కాలేజీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యాసంస్థల ఏర్పాటు ద్వారా విద్యార్థులకు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాం.
  •  కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పా టు, తాగునీటి సౌకర్యాల కల్పనతో పాటు పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు వికేంద్రీకరణ చేపట్టామని వివరించారు.
  •  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లాను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
  •  మానుకోట జిల్లా సాధన కోసం గతంలో ప్రజలు పెద్దఎత్తున ఉద్య మాలు, పోరాటాలు చేశారని గుర్తుచేశారు.
  •  ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా మహబూబాబాద్ జిల్లాను తొలగిం చాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
  • 2015, 2021 సంవత్సరాల్లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఆశీస్సులతో విజయం సాధించానని తెలిపారు.
  • 2024 ఎన్నికల సమయంలో ప్రభుత్వ మార్పు, ప్రతికూల రాజకీయ పరిస్థితులు ఎదురైనప్పటికీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు గట్టిగా పోరాడారని పేర్కొన్నారు.
  • గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ప్రచార తీరును ప్రస్తా వించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని వివరించారు.
  • వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ఫలితాల సరళిని ప్రస్తావిస్తూ, రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఐక్యంగా సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
  •  అర్హులైన ప్రతి పట్టభద్రుడి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించే బాధ్యతను అందరూ తీసుకోవాలని కోరారు.
  •  తమ ఫోన్ ద్వారానే ఆన్‌లైన్‌లో ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
  • 2023 నవంబర్ 1 నాటికి డిగ్రీ, ఓపెన్ డిగ్రీ లేదా పాలిటెక్నిక్ డిప్లొ మా పూర్తి చేసిన అర్హులు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
  • చిరునామా ధ్రువీకరణ కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు లేదా సంబంధిత నివాస ధ్రువీకరణ పత్రాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
  • ఓటరు నమోదు ప్రక్రియకు అవసరమైన ఫొటోలను కూడా అందు బాటులో ఉంచుకోవాలని వివరించారు.
  • గ్రామాల్లోని పట్టభద్రులకు ఓటరు నమోదు ప్రక్రియపై నాయకులు, కార్యకర్తలు అవగాహన కల్పించాలని సూచించారు.
  • గ్రామాల్లో వర్గాలు, గ్రూపుల భేదాలను పక్కనపెట్టి సమష్టిగా పనిచేయాలని కోరారు.
  • ఒకరు బాధ్యత తీసుకున్నారని మరొకరు దూరంగా ఉండకూడదని, ఓటరు నమోదు ప్రక్రియను అందరూ సమష్టి బాధ్యతగా తీసుకోవాలని స్పష్టం చేశారు.
  • ప్రతి నాయకుడు, కార్యకర్త తమ పరిధిలోని అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారి పేర్ల నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
  •  ఓటరు నమోదు ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా గ్రామస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
  •  రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేస్తూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్టంగా సిద్ధం కావాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here