- జనగామ డిపోలో 59 ఓట్ల మెజారిటీతో ఎన్ఎంయూ విజయం
- రాష్ట్రస్థాయిలో ఎంప్లాయీస్ యూనియన్‌కు 100 ఓట్ల మెజారిటీ
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం బీఆర్ఎస్(Brs)పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజే శ్వర్ రెడ్డి(Mla Palla Rajeswer Reddy)అన్నారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతిచ్చిన యూనియన్లు విజయం సాధించడంతో జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్మికులు, యూనియన్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా పాయింట్స్:
- జనగామ ఆర్టీసీ డిపోలో బీఆర్ఎస్ మద్దతిచ్చిన టీజీఎస్‌ఆర్టీసీ ఎన్‌ఎంయూ 59 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
- రాష్ట్రస్థాయిలో టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 100 ఓట్ల మెజారిటీ సాధించింది.
- ఆర్టీసీ కార్మికులు తమ మద్దతును ఓట్ల రూపంలో తెలియజేయడం సంతోషకరమైన విషయం.
- ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షే మం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుంది.
- కార్మికుల ప్రయోజనాల కోసం పోరాడే సంఘాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.
- కార్మికుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం యూని యన్లు నిరంతరం కృషి చేయాలి.

















