13.6 C
London
Monday, June 1, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ కొమురవెల్లిలో చలివేంద్రం ప్రారంభం

కొమురవెల్లిలో చలివేంద్రం ప్రారంభం

0

కొమురవెల్లిలో చలివేంద్రం ప్రారంభం

కొమురవెల్లి:

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పట్టణ కేంద్రంలో మంగళవారం బీఆర్ఆర్ ఫౌండేషన్(BRR Foundation)ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని మంగళవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు, ప్రయా ణీకులు, కార్మికులు, వ్యాపారులు తీవ్రమైన ఎండలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చలివేంద్రం ద్వారా చల్లని నీరు, కొంత విశ్రాంతి అందించడం చిన్నదై నప్పటికీ అవసరమైన సహాయమని తెలిపారు. ప్రజల సౌకర్యం దృష్ట్యా ఇలాంటి సేవా కార్యక్ర మాలు మరిన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజేందర్ రెడ్డిని ఆయన అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here