15.2 C
London
Monday, June 1, 2026
Home వ్యవసాయం రైతు ధాన్యం కుప్పలు…ప్రభుత్వం ఎక్కడ? కొనుగోలు ఎందుకు లేదు?

రైతు ధాన్యం కుప్పలు…ప్రభుత్వం ఎక్కడ? కొనుగోలు ఎందుకు లేదు?

0
  • 25 రోజులు గడిచినా ధాన్యం ఎత్తివేత జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు
  • రైతు కష్టం ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా..?
  • కేంద్రాలు ఓపెన్ చేశామంటూ ప్రచారం…కానీ కొనుగోలు మాత్రం ఎక్కడ?
  • రైతు ఎండలో నిలబడి…వ్యాపారి నీడలో లాభాలు…ఇదేనా పాలన?
  • ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమా? అమలు ఎక్కడ?
  • 25 క్వింటాళ్ల పరిమితి ఎందుకు? రైతును నష్టపెట్టేందుకేనా ఈ నిర్ణయం?
  • బర్దాన్ లేదు…షెడ్లు లేవు…రైతుకు కనీస సదుపాయాలు కూడా లేవు
  • ప్రభుత్వ కొనుగోలు లేక ప్రైవేట్ దందా పెరుగుతోంది.
  • ఏనుమాముల మార్కెట్‌లో జరుగుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డ జనగామ ఎమ్మెల్యే పల్లా

వరంగల్ :

వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో (warangal Enuma mula Market) ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం పై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 25 రోజులు గడిచినా ధాన్యం ఎత్తి వేత జరగకపోవడంతో రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో ధాన్యం కుప్పల దగ్గరే కాపలా కాస్తూ రోజులు గడుపుతున్నారు. ఈ పరిస్థి తులపై జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రైతు కష్టం ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని ప్రచారం చేస్తున్నప్పటికీ, వాస్తవంగా కొనుగోళ్లు జరగడం లేదని ఆయ న ఆరోపించారు. రైతులు ఎండలో నిలబడి ఇబ్బందులు పడుతుంటే, వ్యాపారులు మాత్రం ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని లాభాలు పొందుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, మాటలకే పరి మితమయ్యాయని మండిపడ్డారు. 25 క్వింటాళ్ల పరిమితి విధించడం రైతులను నష్టపరి చే నిర్ణయమని అన్నారు. అలాగే మార్కెట్‌లో బర్దాన్, షెడ్లు వంటి కనీస సదుపాయా లు కూడా లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ కొనుగోళ్లు సక్రమంగా లేకపోవ డంతో ప్రైవేట్ దందా పెరుగుతోందని, రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సోమవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డ్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ప్రజాప్రతిని ధులతో కలిసి నిర్వహించిన ధర్నాలో జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతుల తరఫున నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా పాయింట్స్:

  • వరంగల్ జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జనగామ ఎమ్మె ల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. మార్కెట్‌ను సందర్శించి పరిస్థితులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
  • ప్రభుత్వం చెబుతున్నట్టు కొనుగోలు కేంద్రాలు సక్రమం గా పనిచేయడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.
  • రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
  • తాను చేర్యాల మార్కెట్ సందర్శనలో 25 రోజులైనా ధాన్యం ఎత్తి వేత జరగకపోవడం, భరదాన్ సరఫరా లేకపోవడం వంటి సమస్యలు గమనించామని వెల్లడించారు.
  • ప్రతి కొనుగోలు కేంద్రంలో 60 నుంచి 100 లారీల వరి ధాన్యం పేరు కు పోయి ఉన్నప్పటికీ ఎత్తివేత జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
  • 20 నుంచి 25 రోజులుగా రైతులు తమ పంట అమ్మకానికి ఎదురు చూస్తూ ఇబ్బందులు పడుతు న్నారు. కాంగ్రెస్ హామీలపై రైతులు మోస పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
  • రూ.15వేల ఆర్థిక సహాయం, 24 గంటల విద్యుత్, రూ.2 లక్షల రుణ మాఫీ వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు.
  • గతంలో కే. చంద్రశేఖర్ రావు ప్రభుత్వంలో పండినంత ధాన్యం కొనుగో లు జరిగేదని పల్లా గుర్తు చేసారు.
  • ప్రస్తుతం 25 క్వింటాళ్ల పరిమితి విధించడం రైతులకు అన్యాయమని అన్నారు.
  • ప్రభుత్వ కొనుగోళ్లు జరగకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిం చారు.
  • భరదాన్ కొరత, షెడ్ల లేమి, క్వింటా పరిమితి వంటి సమస్యలు రైతుల ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు.
  • రైతుబంధు, రైతుభీమా, పంట నష్టం పరిహారం వంటి పథకాలు సక్రమంగా అమలు కావడం లేదు..
  • గతంలో ఎకరానికి రూ.10వేలు నష్టం పరిహారం ఇచ్చినట్టు గుర్తు చేశారు.
  • మార్క్‌ఫెడ్ మరియు వ్యవసాయ అధికారులను వెంటనే ధాన్యం కొను గోలు ప్రారంభించాలని ఈ సందర్బంగా హేచ్చరిస్తూ డిమాండ్ చేశారు.
  • మార్కెట్‌కు వచ్చిన ప్రతి గింజను కొనడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
  • ఎండలో రైతులు కష్టపడుతుంటే ప్రైవేట్ వ్యాపారులు నీడలో కొనుగో లు చేయడం అన్యాయమని మండిప డ్డారు. రైతుల సమస్య లపై ప్రభుత్వం స్పందించక పోవడం దురదృష్టకరమని అన్నారు.
  • వరంగల్ ప్రాంత రైతుల సమస్యలపై త్వరలో కల్వకుంట్ల తారక రామా రావు స్పందిస్తారని తెలిపారు. మే 6న భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం చేపడతా మని, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపుని చ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here