- రైతుల పక్షాన నిలిచిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి..
- ఐకేపీ కేంద్రంలో సమస్యల పరిష్కారానికి సత్వర ఆదేశాలు!
- నెల రోజులుగా పేరుకుపోయిన ధాన్యం..వర్షాల భయంతో ఆందోళనలో రైతులు..
- సత్వర చర్యల కోసం కలెక్టర్, అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన జనగామ ఎమ్మెల్యే పల్లా
చేర్యాల:
చేర్యాల మండలం చుంచునకోట గ్రామ శివారులోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎదుర్కొంటున్న సమస్యలపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తక్షణమే స్పందిం చారు. కేంద్రంలో సరైన సదుపాయాలు లేకపోవడం, తార్పా లిన్లు అందుబాటులో లేకపోవడం వల్ల నిల్వ ఉంచిన ఒడ్లు చెదలు పడుతున్నాయని, నెల రోజులుగా ధాన్యం పోసినా తరలించడం లేదని రైతులు మంగళవారం ఎమ్మెల్యేను అడ్డుకుని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వర్షాలు వస్తే పంట మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని కన్నీరు మున్నీ రయ్యారు.
రైతుల గోడును ఓపికగా విన్న ఎమ్మెల్యే పల్లా:
రైతుల గోడును ఓపికగా ఎమ్మెల్యే విని వెంటనే జిల్లా కలెక్టర్, డీసీఎస్ఓ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్య తీవ్రతను వివరించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగడానికి వీల్లేదు. వెంటనే ధాన్యాన్ని తరలించేలా చర్య లు తీసుకోండి అని అధికారులకు తెలిపారు. ప్రజా సమ స్యలపై తక్షణమే స్పందించి, అన్నదాతకు కొండంత అండగా నిలిచిన జననేత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చుంచున కోట రైతాంగం కృతజ్ఞతలు తెలియజేసింది.

















