18.5 C
London
Friday, October 9, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ నా జన్మభూమి స్టేషన్ ఘన్‌పూర్..నా కర్మభూమి జనగామ..!

నా జన్మభూమి స్టేషన్ ఘన్‌పూర్..నా కర్మభూమి జనగామ..!

0
  • జనగామను వీడే ప్రసక్తే లేదు..ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా
  • జనగామ కోసం జీవితాంతం పోరాడుతా..మీ ఆశీర్వాదంతో ఇక్కడే ఉంటా
  • కాంగ్రెస్ 6 గ్యారంటీలు..420 హామీలు ఏమయ్యాయి?
  • రూ.2,500 మహిళల ఖాతాల్లో ఎప్పుడు వేస్తారు?
  • రూ.4 వేల పింఛన్ హామీ ఏమైంది?
  • రైతులకు నీళ్లు, కరెంట్, యూరియా కూడా దొరకడం లేదు
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి
  • రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ?కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీత
  • జనగామలో కదం తొక్కిన మహిళలు, విద్యార్థులు, రైతులు.. కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ ధ్వజం
  • హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం ఆగదు..

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి 

జనగామ:

నా జన్మభూమి స్టేషన్ ఘన్‌పూర్..నా కర్మ భూమి జనగా మ..(My birthplace is Ghanpur station..my karma land is Janagama..!)రాజకీయాల్లో ఉన్నంతకాలం, నాకు అవకాశం ఉన్నంతకాలం మీ ఆశీర్వాదంతో జనగామ లోనే ఉంటా..ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా..ఇక్కడే ఉంటా.. జనగామను నేను చస్తేనే వదులుతా తప్ప వదిలే ప్రసక్తే లేదు అని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుంచి స్థానిక బస్టాండ్ వరకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వ ర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయ  కులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ప్రారం భమైనప్పటి నుంచి బస్టాండ్ వరకు ఎటుచూసినా గులాబీ జెండాలు కనిపించాయి. జై కేసీఆర్..జై పల్లా..జై బీఆర్‌ఎస్.. వద్దురా కాంగ్రెస్ పాలన అంటూ కార్యకర్తలు, ప్రజలు నినా దాలు చేయడంతో జనగామ జిల్లా కేంద్రం మార్మోగింది.

అనంతరం జనగామ చౌరస్తా వద్ద 100 రోజుల్లో 6 గ్యారం టీలు, వంద లాది హామీలు అమలు చేస్తామని చెప్పి అధి కారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, హామీలను అమలు చేయకుండా మొండి వైఖరితో వ్యవహరిస్తోందని నిరసిస్తూ బీఆర్‌ఎస్ జనగామ నియోజకవర్గం ఆధ్వర్యంలో మహిళ లు, విద్యార్థులతో కలిసి మహాధర్నా నిర్వహించారు.

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా పాయింట్స్:

  • కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ కార్డును ప్రజలు దాచుకోవాలని అప్పట్లో భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి చెప్పారు. 100 రోజు ల్లో హామీలను అమ లు చేస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి వచ్చి హామీల వివరాలు చెబుతామని అన్నారు. మరి ఆ హామీల్లో ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా? అని ప్రశ్నిం చారు.
  • ప్రతి నెలా ఆడబిడ్డల ఖాతాల్లో రూ.2,500 జమ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. వచ్చే నెల మొదటి తేదీ నుంచే ఇస్తామని హామీ ఇచ్చారు. మరి వేశారా అక్కా రూ.2,500? ఇంతకాలం అయినా మహిళల ఖాతాల్లో ఆ డబ్బులు ఎందుకు పడలేదు? అని పల్లా ప్రశ్నించారు.
  • మహిళలకు స్కూటీలు ఇస్తామని, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, రూ.1 లక్ష ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలు ఏమయ్యాయని నిలదీశారు.
  • ఈ నెల రూ.2 వేల పింఛన్ వస్తోంది..వచ్చే నెల నుంచి రూ.4 వేల పింఛన్ ఇస్తామని చెప్పారు. మరి ఇచ్చారా అక్కా రూ.4 వేలు? ఎంత తీయగా చెప్పారు..ఎంత బెల్లం పూసిన మాటలు చెప్పారు. కానీ పింఛ న్ మాత్రం రూ.2 వేల దగ్గరే ఉంది. వికలాంగులకు రూ.6 వేల పింఛన్ ఇస్తా మని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు.
  • నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇస్తామని, రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది అని విమర్శించారు.
  • కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వేల సంఖ్యలో ఉద్యోగ నోటిఫి కేషన్లు విడుదల చేసి నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించామని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత ప్రభు త్వం మాత్రం అరకొర నోటి ఫికేషన్లతో నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపించారు.
  • పోలీసు శాఖలో 20 వేల ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 50 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.
  • రాష్ట్రంలో సుమారు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబ ర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు, కళా శాలల యాజమాన్యాలు, అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దు. ఫీజు రీయింబర్స్‌ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఈ అంశం పై శాసనసభలో బీఆర్‌ఎస్ తరఫున గట్టిగా పోరాడుతా మని స్పష్టం చేశారు.
  • పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని కూడా అమలు చేయడం లేదని పల్లా గారు విమర్శించారు. బాణాపూర్ ప్రాంతంలో కేసీఆర్ ప్రభు త్వ హయాంలో నిర్మించిన 550 ఇళ్ల విషయంలో కూడా పేదలకు న్యాయం చేయకుండా సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
  • బాణాపూర్‌లో నిర్మించిన ఇళ్ల విషయంలో పేదలకు న్యాయం జరగాలి. వేలాది మంది లబ్ధిదారులకు అన్యా యం చేస్తే బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదు. అవసరమైతే కలెక్టరేట్‌ను ముట్టడించి పేదల పక్షాన పోరాడ తామని హెచ్చరించారు.
  • కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు బీమా పథకం ద్వారా రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిం చామని తెలిపారు.
  • రైతు కుటుంబంలో ఎవరైనా చనిపోతే 10 రోజుల్లోనే రూ.5 లక్షల రైతు బీమా అందేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవస్థను ఏర్పాటు చేసింది. 1.85 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా అండగా నిలిచామన్నారు.
  • రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించా మని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు నిధుల ను సక్రమంగా అందించకుండా రైతుల ను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
  • కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బచ్చన్నపేట గుడి చెరువు, తపాస్‌ పల్లి రిజర్వాయర్‌ను నింపి 26 గ్రామాలకు సాగునీరు అందించాం..
  • గండిరామారం, చీటకోడూరు, తపాస్‌పల్లి తదితర రిజర్వా యర్లు, చెరువులను నింపి రైతులకు సాగునీరు అందించేం దుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసింది.
  • ప్రస్తుతం బచ్చన్నపేట, జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, పాల కుర్తి ప్రాంతాల్లో రైతులు నీళ్లు, కరెంట్, యూరియా, రైతుబం ధు, రైతుబీమా కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంటలను కొనుగోలు చేయడంలోనూ, బోనస్ అందిం చడంలోనూ ప్రభుత్వం విఫలమైంది..
  • రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ ప్రభు త్వం హామీ ఇచ్చింది. కానీ అనేక ప్రాంతాల్లో రోజుకు 5 నుంచి 6 గంటలు కూడా సక్రమంగా కరెంట్ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే మండిపడ్డారు.
  • రైతులకు నీళ్లు కావాలి..నీళ్లు రావాలంటే కరెంట్ కావాలి. కరెంట్ లేకుండా రైతులు పంటలు ఎలా పండించాలి? ఇచ్చిన హామీ ప్రకారం 24 గంటల విద్యుత్ ఎక్కడ? అని ప్రశ్నించారు.
  • జనగామ జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు మెడికల్ కాలేజీ, పెద్దాసుపత్రి, దేవాదుల నీటిని జనగామకు తీసు కొచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే..
  • జనగామను జిల్లా చేసినందుకా కేసీఆర్ రాజీనామా చేయాలి? మెడికల్ కాలేజీ ఇచ్చినందుకా? పెద్ద ఆసుపత్రి కట్టించినందుకా? జనగా మలోని 80 శాతం ప్రాంతాలకు దేవాదుల నీళ్లు అందించినందుకా? బచ్చన్నపేట గుడి చెరువుతో పాటు 250 చెరువులను నింపినందుకా కేసీఆర్ రాజీనామా చేయాలి? అని ప్రశ్నించారు.
  • ప్రజలు ఐదేళ్ల పాటు పాలించమని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వంపైనే ఉంది. ప్రతి పనికి గత ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని హితవు పలికారు.
  • జనగామ ప్రజలతో తనకు విడదీయరాని అనుబంధం ఉంది.
  • జనగామలోని 277 పోలింగ్ బూత్‌లు, 131 గ్రామాలు, 42 వార్డు లు, 8 మండలాలు, 2 పట్టణాల్లో తనకు ఆశీర్వాదం అందించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
  • పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం, స్కిల్ యూనివ ర్సిటీ పేరుతో పేద విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయడం సరికాదన్నారు.
  • విద్యార్థులు, మహిళలు, రైతులు, నిరుద్యోగుల సమస్యల పరి ష్కారం కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుంది.
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
  • మహాధర్నాను విజయవంతం చేసిన మహిళలు, అక్కచె ల్లెళ్లు, విద్యార్థులు, రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు.
  • మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కదం తొక్కారు. ప్రజల కోసం, తెలంగాణ కోసం మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలి అని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here