- కేసీఆర్ హయాంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేశాం..
- కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మెగావాట్ కూడా పెంచలేదు
- రూ.52 వేల కోట్ల బకాయిలతో బొగ్గు కొరత.. కేటీపీపీని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే
- గోదావరిలో నీళ్లున్నా.. కరెంటు లేక రైతుల పొలాలకు నీరందడం లేదు
- రైతుల సమస్యలు పరిష్కరించకపోతే గ్రామగ్రామాన పోరాటం
కేటీపీపీ వద్ద జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
భూపాలపల్లి:
థర్మల్ పవర్ స్టేషన్ల పరిస్థితులను పరిశీలించడంలో భాగం గా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(KTPP)సందర్శనకు వెళ్లిన జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Mla Palla Rajeswer Reddy),మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్య వతి రాథోడ్‌తో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర బృందాన్ని కేటీపీపీ లోపలికి వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వ విధానాలను, పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేటీపీపీ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సొంత పూచీకత్తు పై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను ప్లాంట్‌లోకి పోలీసులు అనుమతించారు.
అనంతరం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియా పాయింట్స్:
- రైతులకు సాగునీరు, నిరంతర విద్యుత్ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.
- గోదావరిలో సమృద్ధిగా నీరు ఉన్నా.. కరెంటు లేక మోటార్లు నడవక రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.
- రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.
- తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది.
- 2014లో సుమారు 19 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 30 లక్షల కనెక్షన్లు ఇచ్చాం.
- 2014 నుంచి 2023 వరకు విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ రంగాల్లో సుమారు రూ.లక్ష కోట్ల మేర పెట్టుబడులు పెట్టాం.
- కాకతీయ, భద్రాద్రి విద్యుత్ కేంద్రాలతో పాటు భూపాలపల్లి, ఎన్టీపీసీ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాం.
- రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సుమారు 5,500 మెగావాట్ల నుంచి 22 వేల మెగావాట్లకు పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది.
- 400 కేవీ, 132 కేవీ సబ్స్టేషన్లతో పాటు విద్యుత్ ప్రసార, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేశాం.
- ప్రస్తుత ప్రభుత్వం గత మూడేళ్లలో ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచలేదు.
- కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు అవసరమైన స్థాయిలో బొగ్గు సరఫరా కావడం లేదు.
- రోజుకు సుమారు 5 వేల టన్నుల బొగ్గు అవసరం ఉండగా..1,500 టన్నుల వరకు మాత్రమే సరఫరా జరుగుతోంది.
- జెన్కోకు సింగరేణి నుంచి రావాల్సిన బకాయిలు సుమారు రూ.52 వేల కోట్లకు చేరాయని తెలిపారు.
- ఆర్థిక బకాయిల కారణంగా బొగ్గు సరఫరాపై ప్రభావం పడకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.
- గోదావరిలో నీరు అందుబాటులో ఉన్న సమయంలో దాన్ని సాగునీటి అవసరాలకు వినియోగించాలి.
- ఇప్పటికే ఉన్న మోటార్లు, కాలువలు, రిజర్వాయర్లను సమర్థంగా వినియోగించి రైతులకు సాగునీరు అందించాలి.
- కాళేశ్వరం, ఇతర ఎత్తిపోతల పథకాల్లో ఏర్పాటు చేసిన మోటార్లను వినియోగించి నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టాలి.
- కొత్తగా భారీ ప్రాజెక్టులు చేపట్టడం కంటే ఇప్పటికే ఉన్న మౌలిక వసతులను సమర్థంగా వినియోగించడం ద్వారా రైతులకు తక్షణ ప్రయోజనం కల్పించాలి.
- రైతుబంధు, రైతుబీమా, పంట బీమా, యూరియా తదితర అంశాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
- రైతులకు సాగుకు అవసరమైన విద్యుత్, నీరు, ఎరువులను సకాలంలో అందించాలి.
- రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే గ్రామగ్రామాన ప్రజలతో కలిసి పోరాటాలు నిర్వహిస్తాం.
- విద్యుత్, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి.

















