- బీఆర్‌ఎస్ హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం
- ప్రస్తుత ప్రభుత్వం 12 వేల ఉద్యోగాలే ఇచ్చింది
- మెగా డీఎస్సీ పేరుతో పాత నోటిఫికేషన్‌నే మార్చారు
- ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది
- ఉద్యోగార్థుల కోసం కోర్టుల వరకు వెళ్లి పోరాడాం
- 46 పోస్టుల భర్తీకే అనుమతి.. మిగిలిన ఖాళీల సంగతేంటి?
- ఉస్మానియాకు రూ.1,000 కోట్ల హామీ.. నిధులు ఎక్కడ?
- మూడేళ్లుగా విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ లేదు
- ప్రతి గ్రామంలో నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ:
జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల నమో దు ప్రత్యేక సమావేశంలో(Special meeting on MLC Graduates’ constituency voter registration) జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే రాజయ్య, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాయింట్స్:
- గతంలో ప్రతి నియోజకవర్గంలో 10 వేల నుంచి 15 వేల వరకు గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదయ్యారు.
- గత ఓటర్ల జాబితాను ఇప్పటికే నియోజకవర్గ ఇన్‌ఛార్జీలకు పంపించాం.
- ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున, ప్రతి గ్రామానికి ఒకరు లేదా ఇద్దరు ఇన్‌ఛార్జీలను నియమించాలి.
- పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 వార్డులకు ఒకరి చొప్పున బాధ్యతలు అప్పగించాం.
- ప్రతి గ్రామానికి కనీసం ఒక ఇన్‌ఛార్జీని నియమించి నమోదు ప్రక్రి యను వేగవంతం చేయాలి.
- ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్ల గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాం.
- వైద్యుల నమోదుకు ఐఎంఏతో సమన్వయం చేసేందుకు బాధ్యతలు అప్పగించాం.
- న్యాయవాదుల నమోదుకు బార్ అసోసియేషన్ నాయకులతో సమన్వయం చేయాలి.
- గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు ప్రక్రియ ఆన్‌లైన్‌లో కేవలం నాలుగు దశల్లోనే పూర్తవుతుంది.
- డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికెట్, చిరునామా ఆధారం, ఫొటో తదితర వివరాలను అప్‌లోడ్ చేయాలి.
- ఓటరు ఐడీ, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి చిరునామా ఆధారాలను ఉపయోగించుకోవచ్చు.
- సాధారణ ఓటు ఉన్నా లేకపోయినా గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
- 2023 నవంబర్ 1 నాటికి మూడేళ్లు పూర్తయ్యేలా డిగ్రీ, ఓపెన్ డిగ్రీ లేదా డిప్లొమా, పాలిటెక్నిక్ పూర్తి చేసి ఉండాలి. ఫోన్ ద్వారానే పత్రాలను స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.
- దరఖాస్తు అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో చిరునా మా, వివరాలను పరిశీలిస్తారు.
- ప్రయత్నం చేయకుండా విజయం సాధిస్తామని భావించడం సరికాదు.
- పట్టభద్రులందరూ ఓటు హక్కును నమోదు చేసుకుని ప్రజా సమ స్యలపై ప్రశ్నించే గొంతుకగా నిలవాలి.
- రైతులు విద్యుత్, సాగునీరు, ఎరువులు, యూరియా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
- వచ్చే రెండు నెలల్లో ప్రజలపై రూ.5,200 కోట్ల విద్యుత్ చార్జీల భారం పడబోతోంది. రైతుబంధు, రైతుభీమా సరిగా అందక రైతులు నష్టపోతున్నారు.
- బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం.
- పోలీస్ శాఖలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.
- విద్యుత్ శాఖలో 20 వేలకు పైగా ఉద్యోగులను పర్మనెంట్ చేశాం. సింగరేణిలో 14 వేల మందికి ఉద్యోగాలు కల్పించాం.
- ఆర్టీసీలో సుమారు 15 వేల మంది సిబ్బందిని పర్మనెంట్ చేశాం. పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితర పోస్టులను భర్తీ చేశాం.
- GO 46, GO 29లోని సమస్యలపై కోర్టుల వరకు వెళ్లి ఉద్యోగార్థుల తరఫున బీఆర్‌ఎస్ పోరాడింది.
- కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా గత నోటిఫికేషన్లనే కొనసాగిస్తోంది. మెగా డీఎస్సీ పేరుతో గత నోటిఫికేషన్‌నే మార్చి ఇచ్చారు.
- ఇప్పటివరకు కేవలం 12 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పింది.
- రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కేవలం 46 పోస్టులకు మాత్రమే అనుమతి ఇచ్చింది.
- ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదు. కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించలేదు.
- గత మూడేళ్లలో విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చి వివిధ వర్గాలకు చెందిన వారిని వీసీలుగా నియమించాం.
- ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి.
- అధికార పార్టీ నాయకులు పదవులు, ఇల్లు, ప్లాట్ల పేరుతో కార్మికులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
- బెదిరింపులకు కార్మికులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు.
- ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడంతోపాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది. కార్మికులకు ధైర్యం చెప్పి ‘బస్సు’ గుర్తుకు ఓటు వేసేలా కృషి చేయాలి.
- గులాబీ జెండాతో, బీఆర్‌ఎస్ ఓట్లతో గెలిచిన వారు తిరిగి అదే పార్టీ సర్పంచులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
- కార్యకర్తలు, నాయకులు ఎలాంటి ఒత్తిళ్లకు భయపడవద్దు. పట్టభద్రుల ఓటర్ల నమోదు నుంచి ఎన్నికల వరకు అందరూ సమష్టిగా పనిచేయాలి. పట్ట భద్రులు, విద్యావంతులు వాస్తవాలను తెలుసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ముందుకు రావాలి.

















