- దుర్గాదేవి ఆగమనం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
జనగామ పట్టణ కేంద్రంలోని నెహ్రూ పార్క్(Nehru Park) ఆవరణలోని శ్రీ విల్లాస్ కాలనీలో నిర్వహించనున్న దుర్గా దేవి ఆగమనం (The Arrival of Goddess Durga) కార్య క్రమానికి సోమవారం రాత్రి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ..దుర్గాదేవి అమ్మ వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారో గ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించ డంతో పాటు ఐక్యతకు దోహదపడతాయని ఎమ్మెల్యే పల్లా పేర్కొన్నారు. దుర్గాదేవి ఆగమనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధల తో నిర్వహిస్తున్న శ్రీ విల్లాస్ కాలనీ వాసులను అభినందిం చారు..

















