- భక్తిశ్రద్ధల మధ్య బండ్ల బోనాలు..
- ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల:
అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ సందర్బంగా అమ్మవారిని కోరుకున్నారు. శుక్రవారం చేర్యాల మండల కేంద్రంలో నిర్వ హించిన బండ్ల బోనాల పండగ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి(Jangaon MLA Dr. Palla Rajeshwar Reddy on the occasion of Ban dla Bonala festival)శ్రీ మహంకాళి మాత ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బండ్ల బోనాల పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న భక్తు లకు ఎమ్మెల్యే ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలి పారు.

















