18.5 C
London
Friday, October 9, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ ఉత్సవం ఆనందంగా జరగాలి.. ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలి

ఉత్సవం ఆనందంగా జరగాలి.. ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలి

0
  • వినాయక నిమజ్జన వేళ వర్షాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలి

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ:

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే నిమ  జ్జన కార్యక్రమం ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచేలా ఉండా లని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Mla palla Rajeswer reddy)అన్నారు. వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో ఉత్సవ నిర్వాహకులు (Ganesh Festival Organizers) భక్తులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

భక్తి ఉత్సాహంతో పాటు భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వా లి. నిమజ్జనానికి వెళ్లే సమయంలో నీటి ప్రవాహం, చెరువు లు, కుంటలు, కాలువల వద్ద పరిస్థితులను గమనిస్తూ వ్యవహరించాలి. చిన్నారులను నీటి ప్రాంతాలకు దూరంగా ఉంచడంతో పాటు వృద్ధులు, మహిళల విషయంలో కుటుం బ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

నిమజ్జన శోభాయాత్రలు సజావుగా జరిగేలా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ఎలాంటి తొందరపాటు లేకుండా సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే  కోరారు.

వినాయకుడి ఆశీస్సులతో జనగామ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలి. ఉత్సవాల ఆనందం అందరి ముఖాల్లో చిరునవ్వులు నింపాలి. నిమ జ్జన వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here