- వినయ్ భాస్కర్‌పై పోలీసుల దౌర్జన్యంపై పల్లా ఆగ్రహం
- ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు చేయించడం సిగ్గుచేటు
పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి (warangal MGM Hospi tal)దుస్థితిని ప్రశ్నిస్తూ సందర్శనకు వెళ్లిన మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై పోలీసులు వ్యవహరించిన తీరును(Police Attack)జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Mla palla Rajeswer Reddy)తీవ్రంగా ఖండించారు.
ఎంజీఎంలో బెడ్లు, ఆంబులెన్స్‌ల కొరత, పైకప్పులు పెచ్చు లూడుతున్న దుస్థితిపై ప్రశ్నించిన ప్రజాప్రతినిధిని అడ్డుకుని దాడి చేయడం దారుణమన్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నిం చినందుకు కడుపులో తన్నడం, గాయపర్చడం ఏ విధమైన ప్రజాస్వామ్య పాలన? అని ప్రశ్నించారు.
ఆసుపత్రుల పరిస్థితులను చక్కదిద్దాల్సిన ప్రభుత్వం.. ప్రశ్నించే వారిపై పోలీసులతో దాడులు చేయించడం సిగ్గు చేటన్నారు. పోలీసుల అత్యుత్సాహాన్ని వెంటనే అరికట్టి, వినయ్ భాస్కర్‌పై జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రజాప్రతినిధుల బాధ్యత..ఆ గొంతును పోలీసు బలంతో అణచివేయడం ఎవరి వల్లా సాధ్యం కాదని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

















