18.5 C
London
Friday, October 9, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ రాజకీయాలకు అతీతంగా..అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తా

రాజకీయాలకు అతీతంగా..అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తా

0
  • జనగామలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
  • ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి 

జనగామ:

జనగామ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం జనగామ పట్టణం, జనగామ రూరల్ ప్రాంతా లకు చెందిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ (Kalyana Lakshmi, Shaadi Mubar ak Cheques Distribution )కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర  మానికి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వ ర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) ముఖ్య అతిథిగా హాజ రయ్యారు.ఈ సందర్బంగా జనగామ పట్ట ణానికి చెందిన 19 మంది, జనగామ రూరల్‌ కు చెందిన 17మంది లబ్ధిదా  రులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చెక్కులను అందజే శారు.

అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 

  • సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చూసే బాధ్యత తనదన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగక రంగా ఉన్నాయని పేర్కొన్నారు.
  • అర్హత ఉన్న లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు చర్య లు తీసుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here