- మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
కొమురవెల్లి:
మండలంలోని అయినాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ పబ్బో జు విజేందర్ కుమారుడు పబ్బోజు మురళి కార్తీక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందా రు. కుషాయిగూడలో నిన్న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road Accident) తీవ్రంగా గాయపడిన మురళి కార్తీక్‌ను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. బుధవారం విషయం తెలుసు కున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Mla Palla Rajeswer Reddy) మురళి కార్తీక్ నివాసానికి చేరుకుని మృతదేహానికి నివా ళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. మురళి కార్తీక్ మృతి పట్ల ఎమ్మెల్యే తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

















