17.9 C
London
Friday, October 9, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ ఓట్ల తొలగింపుతో లబ్ధి పొందింది బీజేపీనే..

ఓట్ల తొలగింపుతో లబ్ధి పొందింది బీజేపీనే..

0
  • ప్రధాని మోదీ, అమిత్‌ షాలతో ఎన్నికల కమిషన్‌ కుమ్మక్కైంది
  • తెలంగాణలో 95 లక్షల ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరపాలి
  • సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించి చర్యలు తీసుకోవాలి
  •  తొలగించిన ఓట్లను తిరిగి పునరుద్ధరించాలి
  •  పండుగ నేపథ్యంలో రేపటి బీఆర్‌ఎస్‌ ధర్నా వాయిదా వేస్తున్నాం
  •  తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి 

హైదరాబాద్:

దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపు ప్రక్రియతో రాజకీయంగా లబ్ధి పొందింది బీజేపీనేనని జనగామ ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Mla Palla Rajeswer Reddy)ఆరో పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాల ఆదేశా లకు అనుగుణంగా ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణలో ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరిపి, తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లన్నింటినీ తిరిగి ఓటరు జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియా పాయింట్స్:

  • దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపు తీరును ప్రజలు గమనిస్తున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ఓట్ల తొలగింపు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
  •  రాష్ట్రంలో 95 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. తొలి దశలో 73 లక్షల ఓట్లు, రెండో దశలో మరో 21 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే అత్యధిక శాతం ఓట్లు తగ్గాయని విమర్శించారు.
  •  మహారాష్ట్రలో రెండు కోట్లు, కర్ణాటకలో కోటి ఎనిమిది లక్షలు, ఉత్తరప్రదేశ్‌లో రెండు కోట్ల ఓట్లు తొలగించారని పేర్కొన్నారు. గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లోనూ ఓట్ల తొలగింపు జరిగిందన్నారు. ఈ గణాంకాలపై ఎన్నికల కమిషన్‌ అధికారిక వివరాలతో సమగ్ర పరిశీలన జరగాలని కోరారు.
  • ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్ల తొలగింపును రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ గెలిచిన నియోజకవర్గాల్లోనూ పెద్ద సంఖ్యలో ఓట్లు తగ్గించారని విమర్శించారు.
  • శేరిలింగంపల్లి, కరీంనగర్‌, పటాన్‌చెరు సహా హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఈ పరిణామాలపై సమగ్ర విచారణ జరిపి, ఓట్ల తొలగింపు వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్‌ చేశారు.
  • చనిపోయినవారు, నివాసం మారినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదైనవారి ఓట్లను తొలగించే క్రమంలో అర్హులైన ఓటర్ల పేర్లను కూడా తొలగించారని ఆరోపించారు.
  • పేర్లలో అక్షరదోషాలు, ఇంటిపేర్లలో తేడాలు, పాత ఓటరు జాబితాల్లోని వివరాలకు ప్రస్తుత వివరాలు సరిపోలకపోవడం వంటి కారణాలతో నోటీసులు ఇచ్చి ఓట్లను తొలగించారని విమర్శించారు. ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చినా స్పందన రాలేదనే కారణంతో ఓటు హక్కును తొలగించడం సరికాదన్నారు.
  • అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
  • కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌లోని ఇతర కమిషనర్ల అభిప్రాయాలను పక్కనపెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.
  • ఎన్నికల కమిషన్‌ స్వతంత్రత, విశ్వసనీయతను కాపాడేందుకు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించడంతో పాటు, ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
  •  తెలంగాణలో ఓట్ల తొలగింపు విషయంలో బీజేపీకి కాంగ్రెస్‌ పార్టీ పరోక్షంగా సహకరిస్తోందని విమర్శించారు. రెండు పార్టీలు ప్రజల ముందు వేర్వేరుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నా, తెరవెనుక రాజకీయ ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.
  •  ఓటు హక్కు పరిరక్షణ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
  •  తెలంగాణలో తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగిస్తుందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. యువత, విద్యార్థులు, ప్రజలు ఓటు హక్కు పరిరక్షణ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
  • ఎన్నికల కమిషన్‌ ఎదుట నిర్వహించాల్సిన బీఆర్‌ఎస్‌ ధర్నా కార్యక్రమాన్ని పండుగ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి తేదీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.
  • తెలంగాణలో తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చడం, ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరపడం, ఎన్నికల కమిషన్‌ వ్యవహారశైలిపై బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వాలు, సంబంధిత రాజ్యాంగ సంస్థల బాధ్యత అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here