12.5 C
London
Saturday, June 13, 2026
Home పార్టీ కార్యక్రమాలు రాష్ట్రంలో ఒక్క పనైనా చేశారా?

రాష్ట్రంలో ఒక్క పనైనా చేశారా?

0
  • రెండున్నరేళ్లలో 2½ లక్షల కోట్ల అప్పులు చేశారు..
  • రేవంత్ ప్రభుత్వంపై మళ్లీ పల్లా ఫైర్…!
  • బడ్జెట్, అప్పులపై ఘాటు విమర్శలతో దుమ్మురేపిన జనగామ ఎమ్మెల్యే
  • అభివృద్ధి ఎక్కడ కనబడటం లేదు..అప్పులు ఎందుకు? అంటూ కాంగ్రెస్‌ను నిలదీత
  • బడ్జెట్ పెరగదు…అప్పులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి!
  • బీఆర్‌ఎస్ హయాంలో 4½ లక్షల కోట్లతో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది.
  • అసమర్థ సీఎం ఈ రాష్ట్రానికి దొరకడం దురదృష్టం.
  • రేవంత్ పోవాలి…కేసీఆర్ రావాలి నినాదం ఊపందుకుంటోంది
  • 20న జరిగే జగిత్యాల జైత్రయాత్రకు భారీగా తరలిరావాలి

జగిత్యాల:

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మరో సారి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిం చారు. ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(kcr bahiranga sabha) బహిరంగ సభ ఏర్పాట్లలో భాగంగా శనివారం పట్టణ కేంద్రంలో నిర్వహిం చిన కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపో యిందని ఆరోపించారు. ఎక్కడ చూసినా అప్పులే పెరుగు తున్నాయని మండిపడ్డారు. బడ్జెట్ పెరగకపోయినా అప్పు లు మాత్రం విపరీతంగా పెరిగాయని, ఇప్పటికే రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో సుమారు 4½ లక్షల కోట్లతో రాష్ట్రం లో భారీ అభివృద్ధి జరిగిందని ఆయన గుర్తుచేశారు. సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణాలు అప్పట్లో జరిగినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం అలాంటి దూరదృష్టి లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. అసమర్థ నాయక త్వం రాష్ట్రానికి దొరకడం దురదృష్టకరమని వ్యాఖ్యానించా రు. రేవంత్ పోవాలి…కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో వేగంగా వ్యాపిస్తోందన్నారు..జగిత్యాల జైత్రయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

పల్లా ముఖ్య పాయింట్లు:

  • 2014కు ముందు..తర్వాత జగిత్యాల అభివృద్ధిని ప్రజలు పోల్చుకోవాలని సూచించారు.
  • సాగునీటి ప్రాజెక్టులు, పట్టణ అభివృద్ధి పనులు ప్రజల ముందే ఉన్నా యని తెలిపారు.
  • కేసీఆర్ పాలనలో చెరువులు, చెక్‌డ్యామ్‌లు వంటి చిన్న పనులకూ ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు.
  • రోడ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, లైటింగ్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయని పేర్కొన్నారు.
  • ప్రజలు ఎప్పుడూ చైతన్యవంతులే…సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు.
  • 2014, 2018లో కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలయ్యాయని, 2023 లో కాంగ్రెస్ హామీల అమలు ప్రశ్నార్థకమని అన్నారు.
  • రాష్ట్ర బడ్జెట్ పెరగకపోయినా అప్పులు పెరగడం వెనుక కారణాలను ప్రజలు ఆలోచించాలని సూచించారు.
  • బీఆర్‌ఎస్ పాలనలో తీసుకున్న అప్పులు అభివృద్ధి పనులకే విని యోగించారని తెలిపారు.
  • ప్రస్తుతం తీసుకున్న అప్పులు ఎక్కడ ఖర్చవుతున్నాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
  • కొత్త ప్రాజెక్టులు ఏవీ లేవు..పాత వాటినీ కొనసాగించడం లేదని విమర్శించారు.
  • ప్రజల్లో మార్పు కోసం సిద్ధత పెరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ తిరిగి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
  • జగిత్యాల ప్రజలు ఈ సారి కీలక పాత్ర పోషించి రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు నాంది పలుకుతారని పల్లా అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here