- వడ్ల, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల దుస్థితిపై మండిపడ్డ ఎమ్మెల్యే పల్లా
- కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే ఎత్తాలి
- ప్రభుత్వం రైతాంగాన్ని కాపాడాలి
- బిఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు సిద్ధం కావాలి
- ఎస్‌ఐఆర్ ద్వారా అర్హుల ఓట్లు తొలగిపోకూడదు
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
హన్మకొండ:
హన్మకొండ జిల్లాలో గురువారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(PALLA RAJESWER REDDY HOUSE)నివాసంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బిఆర్ఎస్ ముఖ్య నాయకుల వ్యూహాత్మక సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హన్మకొండ, వరం గల్, జనగామ జిల్లాలకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయా కర్ రావు, మాజీ ఎమ్మెల్యే లు దాస్యం వినయ్ భాస్క ర్, నన్నెపునేని నరేందర్, ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, తాటికొండ రాజయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, పార్టీ ముఖ్య నాయకులు హాజరై వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల దుస్థితి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జిల్లా పార్టీ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లా డుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వడ్లు, మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయాయని తెలిపారు. ఎక్కడ చూసినా బస్తాల కొరత ఉందని, కొనుగోలు ప్రక్రియ సక్రమం గా జరగడం లేదని విమర్శించారు. ఇప్పటికే లిఫ్ట్ చేసిన ధాన్యాన్ని కూడా అన్‌లోడ్ చేయకుండా నిల్వ ఉంచుతు న్నారని అన్నారు. ధాన్యం దించేందుకు కూలీల సమస్య తీవ్రంగా ఉందని, రాష్ట్రంలోని అన్ని ఐకేపీ కేంద్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు.
కోటి మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు 25 శాతం కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. రైతులు పండించిన పంట కొను గోలు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఒకవైపు వడదెబ్బలు, మరోవైపు గుండెపోటులతో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వం వెంటనే అత్యవసర చర్యలు తీసుకుని ధాన్యం కొను గోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన రైతు సభతో ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చిందని పల్లా గుర్తు చేశారు. ఆ సభ తర్వాత అధికారులు, పాలకుల్లో కొంత హడావుడి కనిపించిందన్నారు. కానీ అనంతరం పరి స్థితి మళ్లీ మొదటికే వచ్చిందని విమర్శించారు. ప్రస్తుతం ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్టుగా ఐకేపీ కేంద్రాల్లో సమస్య లు అలాగే కొనసాగుతున్నాయని అన్నారు. రైతుల సంక్షే మంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
రైతుల ధాన్యం చివరి గింజ కొనుగోలు చేసే వరకు బిఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని పల్లా స్పష్టం చేశారు. రైతులకు పూర్తి న్యాయం జరిగే వరకు ఉద్యమాలు కొనసా గిస్తామని హెచ్చరించారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని పల్లా పేర్కొన్నారు. ప్రతి బూత్‌లో ఇద్దరిని గుర్తించి వారికి సభ్య త్వ నమోదు ప్రక్రియపై శిక్షణ ఇస్తామని తెలిపారు. కేంద్రం జూన్ 25 నుంచి చేపట్టనున్న ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంపై బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో అర్హుల ఓట్లు తొలగిపోకూడదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ డిజిటల్ విధానంలో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ప్రతి బూత్‌లో ఇద్దరిని గుర్తిం చడం జరుగుతుందని, వారికి జూన్ మొదటి వారంలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. బిఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు అనేక మంది ఉత్సాహం చూపుతున్నారని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

















