17.4 C
London
Sunday, May 31, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 

0

జనగామ: జనగామ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం జరిగిన వివాహ వేడుకల్లో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(JANAGAMA MLA )పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్బంగా ముందుగా జనగామ పట్టణ కేంద్రంలోని సాయిరాం గార్డెన్స్‌లో మార్క ఐలయ్య కుమార్తె వివాహ వేడుకలో ఎమ్మెల్యే పల్లా హాజరై వధూవ రులకు ఆశీస్సులు అందించారు. అనంతరం చేర్యాల పట్ట ణంలోని వీరభద్ర గార్డెన్స్‌లో ఈరు చంద్రం కుమార్తె వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించా రు. అలాగే చేర్యాల పట్టణంలోని భద్రకాళీ గార్డెన్స్‌లో ఈరు బాలమల్లు కుమారుడి వివాహ వేడుకలో ఎమ్మెల్యే పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here