- బీఆర్ఎస్ను భయపెట్టలేరు
- అక్రమ కేసులు, అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరు
- ప్రజా సమస్యల కోసం సభలోనైనా.. సభ వెలుపలనైనా పోరాటమే
- మీడియాతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్:
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు (Erravelli Farmhouse)వెళ్లేందుకు యత్నించిన బీఆర్ ఎస్ అగ్రనేతలు, ఎమ్మెల్యేలను పోలీసులు హకీంపేట్ వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుతో(Harish Rao)పాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy), తదితర నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలిం చారు. బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న విష యం తెలియడంతో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిసరా ల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసు లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ పార్టీ నాయకు లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కార్య కర్తలు ఆందోళనకు దిగారు.
అనంతరం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ ఎస్ నాయకుల పట్ల అనుసరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భం గా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
ఎమ్మెల్యే పల్లా మీడియా పాయింట్స్:
- కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోంది.
- కేసీఆర్ నివాసంపై దాడి చేయడానికి వచ్చిన వారిని అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపైనే అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు.
- దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, వారిని అడ్డుకున్న వారిపైనే కేసులు నమోదు చేయడం అన్యా యం.
- రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించింది.
- రౌడీలు, గుండాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
- మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతున్నా ప్రభు త్వం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదు.
- అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు, బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు భయపడరు.
- తెలంగాణ ప్రజల హక్కులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతుంది.
- 22ఏ భూముల వ్యవహారంలో భారీ అక్రమాలు జరుగుతు న్నాయి.
- నిరుపేదలు, సామాన్య కుటుంబాలకు చెందిన భూములను నిషేధిత జాబితాలో ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
- భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు 30 నుంచి 50 శాతం వరకు వాటాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
- వేలాది కుటుంబాల ఆస్తులను లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
- రేవంత్ రెడ్డి ప్రభుత్వ అక్రమాలు, కక్షసాధింపు చర్యలకు తగిన సమయంలో ప్రజలే గట్టి బుద్ధి చెబుతారు.
- శాసనసభలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే సభ వెలుపలే ప్రజల తరఫున పోరాటం చేస్తాం.
- తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు.

















