13.6 C
London
Monday, June 1, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ మట్టిలో మాణిక్యం లాంటి మహనీయుడు చుక్క సత్తయ్య..!

మట్టిలో మాణిక్యం లాంటి మహనీయుడు చుక్క సత్తయ్య..!

0
  • తన కళను కులం, కుటుంబం, ప్రాంతానికి పరిమితం చేయలేదు..
  • 12వేలకుపైగా ఒగ్గు ప్రదర్శనలు..1700 మంది శిష్యులను తీర్చిదిద్దిన కళాకారుడు
  • దేవుళ్ల కథలతో పాటు కట్న వ్యతిరేకం, మద్యం నిరోధంపై కథనాలు
  • వారి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిది
  • జనగామలో ఘనంగా చుక్క సత్తయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం
  • ముఖ్య అతిధిగా హాజరైన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ:

జనగామ జిల్లా కేంద్రంలోని కళ్లెం కామన్ వద్ద ఏర్పాటు చేసిన ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య (chukka sattaih )విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆదివారం ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్బంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా మాట్లాడారు.

ఎమ్మెల్యే డాక్టర్ పల్లా పాయింట్స్:

  • మన జనగామ జిల్లాలోని మాణిక్యపురంలో మట్టిలో మాణిక్యం లాగా పుట్టిన మహనీయుడు చుక్క సత్తయ్య అని కొనియాడారు.
  • చుక్క సత్తయ్య తన పని కుటుంబానికో, కులానికో, ప్రాంతానికో పరి మితం చేయలేదని, సమాజం మొత్తానికి ఉపయోగపడేలా తన కళను అంకితం చేశారు.
  • చదువు లేకపోయినా, తనకు అవసరమైనంత వరకు విద్యను స్వయం గా నేర్చుకొని సంప్రదాయ ఒగ్గు కళకు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చారు.
  • దేవుళ్ల కథలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పిన విధానానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సహా అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారని గుర్తు చేశారు.
  • ఈ ప్రాంతంలోని శ్రామిక మహిళలు, పురుషులు, కార్మిక లోకానికి చుక్క సత్తయ్య కథలు జీవన మార్గదర్శకంగా మారాయని చెప్పారు.
  • ఒగ్గు కథను పరిశోధన చేసి, సరైన పద్ధతిలో ఎలా చెప్పాలో శిక్షణనిస్తూ సుమారు 12 వేలకుపైగా ప్రదర్శనలు నిర్వహించారు.
  • తనలాగే ఒగ్గు కళను కొనసాగించేలా సుమారు 1700 మంది శిష్యుల ను తయారు చేసిన మహనీయుడని పేర్కొన్నారు.
  • జనగామ జిల్లా అనేక మహనీయులను కన్నదని, తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, చుక్క సత్తయ్య లాంటి వారు ఈ ప్రాంతానికి గర్వకారణమని అన్నారు.
  • చుక్క సత్తయ్య దేవుళ్ల కథలకే పరిమితం కాకుండా, కట్నం తీసుకో వద్దు..మద్యం సేవించవద్దు వంటి సమాజానికి ఉపయోగపడే సందే శాలను కథల రూపంలో చెప్పారు.
  • సమాజంలో ఉన్న చెడు అలవాట్లకు వ్యతిరేకంగా కథల ద్వారానే ఉద్యమించిన ఒక సామాజిక విప్లవకారుడు చుక్క సత్తయ్య అని ఎమ్మెల్యే కొనియాడారు.
  • ఇలాంటి మహనీయుల విగ్రహ ఆవిష్కరణలు యువతకు ప్రేరణగా నిలుస్తాయి. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here