13.1 C
London
Saturday, October 17, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..!

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..!

0
  • మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సతీమణి నీలిమ
  • వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే పల్లా

జనగామ:

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వ ర్‌రెడ్డి సతీమణి నీలిమ మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి బతుక మ్మ ఆడారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Mla Palla Rajeswer Reddy, Ex minister Errabellli Dayaker Dao)వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో నియోజ కవర్గానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహిళలు రంగురంగుల పూలతో బతు కమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయబద్ధంగా ఆటపాటలతో సంబ రాలు జరుపుకు న్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సతీమణి నీలిమ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి దయాకర్, ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ..బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచు ల ఆత్మీయతకు, ఐక్యతకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొ న్నారు. పూలతో బతుకమ్మల ను పేర్చి, ఆటపాటలతో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్నా రు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు, మహిళల మధ్య ఆత్మీయతను పెంపొందిం చడంలో బతుకమ్మ వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here