17.4 C
London
Thursday, July 16, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ SIR ప్రక్రియ విజయవంతానికి బీఆర్‌ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి.

SIR ప్రక్రియ విజయవంతానికి బీఆర్‌ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి.

0
  • ప్రతి అసలైన ఓటరికి ఎన్యూమరేషన్ ఫామ్ నింపడంలో ప్రజలకు సహకరించాలి
  •  ఓటర్ల పేర్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలి
  • ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలి..
  • సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
  • SIR ప్రక్రియపై బీఆర్‌ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి దిశానిర్దేశం

జనగామ:

తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి(Janagama Mla) పిలుపునిచ్చారు. సోమవారం జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో (Mla Camp Office) పట్టణ ముఖ్య నాయకులు, కార్యక ర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ భవిష్యత్ కార్యాచరణ తో పాటు SIR ప్రక్రియ, ఓటర్ల జాబి తా ప్రత్యేక సవరణ, ఎన్యూమరేషన్ ఫామ్ నింపే విధానంపై కీలక సూచనలు చేశారు.

ఎమ్మెల్యే పల్లా మీడియా పాయింట్స్:

  • ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్త, బూత్ లెవల్ ఏజెంట్ బాధ్యతాయుతంగా వ్యవహరించా లని సూచించారు.
  • ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఎన్యూమ రేషన్ ఫామ్‌ లను సక్రమంగా నింపడంలో సహకరించాలని కోరారు.
  • బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటికి రెండు ప్రీ-ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్‌లు అందజేస్తారు. వాటిలో ఒకదాన్ని పూర్తి చేసి BLOకు ఇవ్వాలని, మరో కాపీని రసీదుగా భద్ర పరుచుకోవాలి.
  • ఫామ్‌లో ఓటరు పేరు, తండ్రి లేదా భర్త పేరు, పుట్టిన తేదీ, పూర్తి చిరునామా, EPIC నంబర్ వంటి వివరాలను ఎలాం టి తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు.
  • కుటుంబంలోని ఓటర్ల వివరాలను ఒకే చోట నమోదు చేసే ఫ్యామిలీ మ్యాపింగ్ ప్రక్రియ అత్యంత కీలకమని, 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా పరిగణిస్తారని వివరిం చారు.
  • ఆధార్‌లో ఉన్న వివరాలకు అనుగుణంగానే ఫామ్‌ను నింపాలి. అవసరమైన డిక్లరేషన్‌పై సంతకం చేయాలని సూచించారు. అలాగే 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న కొత్త ఓటర్ల కోసం BLO అందించే ఫామ్–6ను కూడా తప్ప నిసరిగా నింపి సమర్పించాలి.
  • జూలై 24 వరకు ఇంటింటి వెరిఫికేషన్, ఫామ్‌ల సేకరణ జరుగు తుంది. జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల అవుతుంది. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంత రాలు, క్లెయిమ్‌ల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్ 1, 2026న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారని వివరించారు.
  • ఓటర్లు ఆఫ్‌లైన్‌తో పాటు ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌ సైట్‌ల ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
  • ఎన్నికల ప్రక్రియలో భాగంగా కొత్తగా వచ్చిన ‘SIR’ విధానం ద్వారా ఓట్లన్నింటినీ సరిచూస్తున్నారు. ఎవరి ఓటైనా తొలగించబడిందా, చనిపోయిన వారి వివరాలు ఉన్నాయా, డబుల్ ఓట్లు ఉన్నాయా అనేది చెక్ చేస్తున్నారు. గ్రామంలో ఓటు లేకపోతే మనిషి బతికున్నా చనిపోయిన వారితో సమానంగా చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ BL1, BL2ల వెంటపడి ఓటు ఉండేలా చూసుకోవాలి.
  • కాబట్టి అసలైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి. ప్రజల ఇళ్లకు వెళ్లి SIR ఎన్యూమ రేషన్ ఫామ్‌ లను సరిగ్గా నింపడంలో సహాయం చేయాలి.
  • ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఎన్నికల అధికా రుల దృష్టికి తీసుకెళ్లాలి. అదే సమయంలో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలి. సోషల్ మీడి యా వేదికగా ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలను సమర్థవం తంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here