18.5 C
London
Friday, October 9, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ నిరసన చేస్తే అరెస్టులా..? ప్రశ్నిస్తే కేసులా..?

నిరసన చేస్తే అరెస్టులా..? ప్రశ్నిస్తే కేసులా..?

0
  • ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా..? పోలీసుల తీరుపై పల్లా ఫైర్
  • ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే పోలీసు వ్యవస్థనా..?
  • కేటీఆర్, హరీశ్ రావుపై కేసుల నమోదు రాజకీయ కక్షసాధింపే!
  • శాంతిభద్రతలపై దృష్టి పెట్టండి..రాజకీయ కక్షసాధింపు మానండి..
  • కేసీఆర్ నివాసం వద్ద జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలి..
  • ప్రభుత్వ మాటలకు.. క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన ఎక్కడ..?
  • ప్రశ్నించే గొంతులను కేసులతో అణచలేరు.. ప్రజల కోసం పోరాటం ఆపం..
  • వైఖరి మార్చుకోకపోతే ప్రజల తరఫున భారీ ఆందోళనలు తప్పవు!

మీడియాతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 

హైదరాబాద్:

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, పోలీసుల వ్యవహార శైలి, ప్రతిపక్ష నాయకులపై(Political Arrests, Telangan a Police)నమోదవుతున్న కేసులు, మహిళా ప్రజాప్రతిని ధులపై జరిగిన ఘటనలు, డీప్‌ఫేక్ ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwer Reddy) పాల్గొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…

  • రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోందని, పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తు న్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
  • అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు వెళ్తున్న ఎమ్మెల్యే  లు, ఎమ్మె ల్సీలను పోలీసులు అడ్డుకోవడం, ముందస్తు అరెస్టులు చేయడం, అనంతరం వారిపైనే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజాప్రతి నిధులను సభలకు వెళ్లకుండా అడ్డుకునే హక్కు పోలీసుల కు లేదని స్పష్టం చేశారు.
  • రోడ్డుపై నినాదాలు చేయడం, నిరసన వ్యక్తం చేయడం లేదా నిరసన సందేశాలతో కూడిన దుస్తులు ధరించడం చట్టవిరు ద్ధం కాద న్నారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు వివిధ సందర్భాల్లో నిరసన లు వ్యక్తం చేసినప్పుడు లేని అభ్యంత రాలు, తెలంగాణలో ప్రతిపక్ష సభ్యుల విషయంలో ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.
  • ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారెం టీలు అమలు చేయలేదని ప్రశ్నించడం నేరమా అని నిలదీ శారు. 100 హామీలు, 1000 రోజుల పాలనలో వాటి అమ లు ఏ మేరకు జరిగిందో ప్రజల ముందు ప్రశ్నిస్తామని, కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
  • రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంపైనే పోలీసులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాలుగా హత్యలు, దోపిడీ లు, మహిళ లపై నేరాలు పెరుగుతున్నాయన్నారు. నేషనల్ క్రైమ్ రికా ర్డ్స్ బ్యూరో నివేదికలను పరిశీలించి వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు ఉంచాలని కోరారు.
  • మహిళా ప్రజాప్రతినిధుల పట్ల జరిగిన ఘటనలపై కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా లెజిస్లేటర్లను అడ్డుకోవడం, వారిపై అనుచితంగా ప్రవర్తిం చిన ఘటనలను తీవ్రంగా ఖండించారు. మహిళా ప్రజాప్రతి నిధిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యా దు చేసినట్లు తెలిపారు.
  • అలాగే, ఏఐ సాంకేతికతతో రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదులు చేసినప్పటికీ కొన్ని ఘటన ల్లో ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
  • ఒకవైపు ప్రతిపక్ష నేతలపై వరుసగా కేసులు నమోదు చేస్తూ, మరోవైపు తమ ఫిర్యాదులపై పోలీసులు స్పందించ  కపోవడం ఏకపక్ష వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కేటీఆర్, హరీశ్ రావు, ఇతర బీఆర్‌ఎస్ నాయకులపై పలు కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు.
  • మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం వద్ద జరిగిన ఘటన లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం పోరాడిన నాయకుడిపై ఇలాంటి పరిస్థితులు రావడం బాధాకర మన్నారు.
  • ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు పొంతన లేదన్నారు. ప్రభుత్వ ప్రకటనలపై ఫ్యాక్ట్ చెక్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఇతర గ్యారెం టీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
  • రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాల్సిన పోలీసులు, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. చట్టబద్ధంగా వ్యవహరించని అధికారులపై అవసరమైతే చట్టపరమైన పోరాటం చేస్తామని హెచ్చరించారు.
  • ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here