Bachanna pet news
  • లేకుంటే నేనే వస్తా సీసలు పగలగొడతా
  • జనగామ ఎమ్మెల్యే పల్లా మాస్ వార్నింగ్

బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం (Bachanna pet)  చిన్నరామచర్ల గ్రామంలో ఐకెపి సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే మాట్లాడుతూ మద్యపానం నిషేధంలో చిన్నరామచర్ల గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, నిషేధానికి కృషి చేసిన సర్పంచ్ ఎండి అజామ్ ను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ప్రొద్దున లేస్తే పాలు తీసుకురావడానికి వెళ్లే రైతుల కానుంచి పనికి వెళ్లే కూలి వరకు పొద్దున 5 గంటల నుండి రాత్రి పది గంటల వరకు విరామం లేకుండా బెల్ట్ షాపులలో మద్యం విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిని ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రతి మద్యంపై నలభై రూపాయలు ఎక్కువ రేటు కు అమ్ముతూ ప్రజలను దోచుకుం టున్నారు. ఇంత జరుగుతున్న ఎక్స్చేంజ్ అధికారులు పట్టించుకోకుం డా వైన్స్ వాళ్లతో కుమ్మక్కై విచ్చలవిడిగా వారికి నచ్చిన ధరకు అమ్మకా లు జరుపుతున్నారు. ప్రజలు బెల్ట్ షాపుల వల్ల ఆర్థికంగా,ఆరోగ్యంగా నష్టపోతున్నారు. వారం రోజులలో బెల్ట్ షాపులు బంద్ చేయాలని మాస్ వార్నింగ్ వదిలారు. ఒకవేళ బంద్ చేయకపోతే తానే స్వయంగా వచ్చి సీసలు పగలగొడతానని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here