15.2 C
London
Monday, June 1, 2026
Home ప్రజా సమస్యలు అందాల భామల ఈవెంట్లకు వందల కోట్లు…కార్మికుల కోసం మాత్రం డబ్బులు లేవా?

అందాల భామల ఈవెంట్లకు వందల కోట్లు…కార్మికుల కోసం మాత్రం డబ్బులు లేవా?

0
  • దమ్ముంటే ఆర్టీసీ కార్మికులకు 44 శాతం పీఆర్సీ ఇవ్వండి
  • ఈ చేతితో ఇచ్చి మరో చేతితో తీసుకునే డ్రామాలు వద్దు
  • రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలు మరిచింది
  • ఆర్టీసీ విలీనం ఇప్పటికీ ఎందుకు పెండింగ్‌లో ఉంది?
  • మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీపై పని భారం పెరిగింది
  • మహిళా కండక్టర్ల సమస్యలు వర్ణనాతీతం
  • ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది
  • జనగామ డిపో నుంచి ఒక్క బస్సు కూడా పోనివ్వం
  • యావత్ సమాజం ఆర్టీసీ కార్మికుల పక్కనే నిలుస్తుంది
  • శంకర్ గౌడ్ ఆత్మహత్య కాదు…ఇది ప్రభుత్వ హత్య!
  • కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి
  • ఆర్టీసీ విలీనం అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
  • లేనియెడల సమ్మెను రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తాం
  • ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జనగామలో ఎమ్మెల్యే పల్లా నిరసన

                 రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్

జనగామ:

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ప్రకటించిన సమ్మె కు మద్దతుగా జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహిం చిన నిరసన కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (JANGAON MLA PALLA RAJESWER REDDY )పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే తీవ్రం గా మండిపడ్డారు.

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాయింట్స్:

  • ప్రభుత్వం మారితే వెసులుబాట్లు వస్తాయని ఆశించి, ఆర్టీసీ కార్మికులు కోరుకున్న విధంగానే ప్రభుత్వం ఏర్ప డిందని చాలామంది ఆనాడు సంతోషపడ్డారు.
  •  గత 10ఏళ్లుగా ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించారని, తెలంగాణ రావాలని ప్రతి ప్రయాణికుడికి తెలియజేశారని గుర్తు చేశారు.
  • తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారి పీఆర్సీగా 44 శాతం ఇచ్చారు.
  • దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి పీఆర్సీగా 44 శాతం అమలు చేశారని, ఆ తర్వాత కార్మికులు ఎలాంటి స్ట్రైక్ చేయలేదు.
  • ఒకసారి స్ట్రైక్‌కు వెళ్లినప్పుడు దాదాపు 53 రోజులు పోరాడారని, అప్పటి ప్రభుత్వంలో కొంత మిస్ కమ్యూ నికేషన్ జరిగిందని చెప్పారు.
  • స్ట్రైక్ విరమించిన సమయంలో దాదాపు రూ.1000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఇచ్చింది.
  • విలీన అంశం వచ్చినప్పుడు విలీనం చేస్తే ఇబ్బందులు వస్తాయని కొందరు చెప్పారని, ఏపీ పరిస్థితిని అధ్యయనం చేసి రమ్మని అధికారులను పంపినట్లు తెలిపారు.
  • అధ్యయనం అనంతరం కె. చంద్రశేఖర్ రావు రెండో ప్రభుత్వం అరవై నెలల ముందే విలీనంపై నిర్ణయం తీసుకుందని చెప్పారు.
  • క్యాబినెట్ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపారని, విలీనం వల్ల కార్పొరేషన్ కంటే ఉద్యోగులకు భద్రత పెరుగుతుందని ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
  • రాజకీయ కోణం అంటూ కొందరు విమర్శించినా, కార్మికులు మాత్రం విలీనం కావాలని కోరారు.
  • గత ప్రభుత్వం విలీనం చేస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఆనాటి గవర్నర్ వద్ద అది నిలిచిపోయింది.
  • ఆర్టీసీ విలీన తీర్మానం ఇప్పటికీ ఎందుకు పెండింగ్‌లో ఉందని ప్రశ్నించారు.
  • రెండున్నర ఏళ్లలో ఎల్‌ఓటీ బిల్లులు, ఎమ్మెల్సీ బిల్లులు చేసిన ప్రభుత్వం ఈ బిల్లు చేయడానికి ఎందు కు ముందుకు రావడం లేదని నిలదీశారు.
  •  ఇతర బిల్లుల కోసం రేవంత్ రెడ్డి కూర్చొని అందరినీ సంతృప్తి పరచి చర్చలు చేస్తారని, మరి ఈ బిల్లుకు ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నించారు.
  •  వేలాది మంది ఆర్టీసీ కార్మికులు ఉద్యోగ విలీనం కోరుతున్నారు.
  • ఈ సంస్థకు ఆస్తులు లేవా? ప్రజలకు సేవ చేయడం లేదా? కార్మికులు ఇతర ఉద్యోగుల్లా పనిచేయడం లేదా? అని ప్రశ్నించారు.
  • 53 రోజుల స్ట్రైక్ సమయంలో కార్మికులను లోపలికి అనుమతించకుండా బయటకు నెట్టేశారని ఆరోపించారు.
  • పోలీస్ సిబ్బందిపైనా ప్రభుత్వం ఎందుకు కనికరం చూపడం లేదని ప్రశ్నించారు.
  • ఎండలో నిలబడి డ్యూటీ చేస్తున్న కార్మికులపై కనీస మానవత్వం లేదని విమర్శించారు.
  • అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టీసీ కార్మికులకు పనికిరాని స్థితి తీసుకొచ్చారని, నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేశారని మండిపడ్డారు.
  • నిరసన సమయంలో టెంట్ వేసుకునే అనుమతి కూడా ఇవ్వలేదని, డీఎం, పోలీస్ అధికారులు ఎందుకు మనసు పెట్టడం లేదని ప్రశ్నించారు.
  • దురదృష్టవశాత్తూ శంకర్ గౌడ్‌ను కోల్పోయామని, ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని స్పష్టం చేశారు.
  •  ఆయన కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు.
  • పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంఘటన ప్రతి కార్మికుడి గుండెను కదిలించిందన్నారు.
  • మహిళా కండక్టర్లు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం.
  • బస్సులు నిలిపే చోట వసతులు లేక దోమల మధ్యే నిద్రపోవాల్సి వస్తోంది.
  • అధికారులు మనసు పెట్టి ఆలోచించాలని, మెమోలు ఇచ్చి కుటుంబాలను ఆగం చేయొద్దని హితవు పలికారు.
  • సంస్థ నష్టానికి ప్రధాన కారణం ఉన్నత అధికారుల నిర్లక్ష్యం, అవినీతేనని ఆరోపించారు.
  • కార్మికులు విలీనం చేయమని అడిగారని, గత ప్రభుత్వం తీర్మానం చేసిందని, ఈ ప్రభుత్వం మేనిఫె స్టోలోనూ తప్పకుండా విలీనం చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు.
  •  రెండున్నర ఏళ్లుగా మీరు చెప్పింది చేయమని స్ట్రైక్ చేస్తుంటే, అందులో శంకర్ గౌడ్ బలిదానం చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
  • మహాలక్ష్మి పథకం పేరుతో పని భారం పెరిగి 8 గంటల పని 16 గంటలయ్యింది.
  • ఎన్నికల బస్సులను ప్రైవేటులకు ఇచ్చి, నష్ట బస్సులను కార్మికులతో నడపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.
  •  పీఆర్సీ 2021, 2025 ఇవ్వాలని బీఆర్‌ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
  •  ఈ చేతితో ఇచ్చి, మరో చేతితో తీసుకునే డ్రామాలు వద్దని, దమ్ముంటే మళ్లీ 44 శాతం పీఆర్సీ ఇవ్వాలని సవాల్ విసిరారు.
  • కార్మికులకు రావాల్సిన రూ.3,000 కోట్ల మహాలక్ష్మి బకాయిలు ఇంకా ఇవ్వలేదు.
  • వందల కోట్లతో ఈవెంట్లు, ఆటలు నిర్వహిస్తారు కానీ కార్మికుల హక్కుల కోసం డబ్బులు లేవా? ఇది ఎక్కడ న్యాయమని ప్రశ్నించారు.
  • పోలీస్ సిబ్బంది కూడా ఒక్కసారి ఆలోచించాలని, వారికి కూడా ఆరోగ్య భద్రత, స్టేషన్ మైంటెనెన్స్ ఇవ్వడం లేదు.
  • గత ప్రభుత్వం 25 నుంచి 75 వేల వరకు మైంటెనెన్స్ ఇచ్చిందని, అదే కోపాన్ని ఇప్పుడు ఉద్యోగులపై చూపిస్తున్నారని ఆరోపించారు.
  • 6,400 కోట్ల రిటైర్మెంట్ బకాయిలు, మరో 6,000 కోట్ల ఇతర ఉద్యోగుల బకాయిలు ఇవ్వాల్సి ఉంది.
  • మొత్తం 12వేల కోట్ల బకాయిలు ఉంటే, ఎమ్మెల్యేలు, మంత్రులు సగం ఇవ్వాలని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.
  • గత ప్రభుత్వం చేసిన విలీన తీర్మానాన్నే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
  • ఇవాళ 3 వేల కోట్లు మహాలక్ష్మి పథకానికి ఇస్తే, 2021, 2025 పీఆర్సీలు ఇవ్వవచ్చు.
  • మనసు ఉంటే మార్గం ఉంటుంది.
  • మహాలక్ష్మి బకాయిలు ఇస్తే కార్మికులకు ఇవ్వా లని, కొత్త బిల్లు, కొత్త తీర్మానం అవసరం లేదు.
  • రెండున్నర ఏళ్లలో ఖాకీ డ్రెస్ వేసుకున్న నీ ఫోర్స్ ఎటు పోయిందని ప్రశ్నించారు.
  • శంకర్ గౌడ్ ఆత్మ గోసిస్తోంది…ఆలోచించండి.
  • పొన్నం ప్రభాకర్ ఉద్యమాకారుడు అని చెప్పుకుం టూ, ఇష్టం వచ్చినట్లు చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు.
  • కొత్త బిల్లు వద్దు…కొత్త తీర్మానం వద్దు…తాత్కా లిక, ఔట్‌సోర్స్ ఉద్యోగాలతో బస్సులు నడవవని స్పష్టం చేశారు.
  • జనగామ డిపో నుంచి ఒక్క బస్సు కూడా పోనివ్వ మని హెచ్చరించారు.
  • యావత్ సమాజం ఆర్టీసీ కార్మికుల పక్కన నిలుస్తుంది.
  • రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు.
  •  శంకర్ గౌడ్ ఆత్మహత్య కాదు…ఇది ప్రభుత్వ హత్య అని మరోసారి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here