17.4 C
London
Thursday, July 16, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

0
  • పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
  • ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి వేయించాలి
  • ఆరోగ్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే  
  • గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
  • పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి 

నర్మేట:

నర్మేట మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో టీకా పంపిణీ(Pulse Polio vaccine distrib ution) కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Janagama Mla Palla)ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానికంగా ఏర్పాటు చేసిన పోలియో కేంద్రం లో ఓ చిన్నారికి స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్య క్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్బం గా ఎమ్మెల్యే  ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బందితో మాట్లాడి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణ, పోలియో చుక్కల పంపిణీ విధానం, లక్ష్యంగా నిర్దేశించిన చిన్నారుల సంఖ్య, గ్రామాల వారీగా చేపట్టిన ఏర్పాట్లు తదితర వివరా లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులతో మాట్లాడి ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలి యో చుక్కలు వేయించాలని సూచించారు.

ఎమ్మెల్యే పల్లా మీడియా పాయింట్స్:

  • సమాజంలో పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలిం చడమే మన అందరి బాధ్యత..
  • ఐదేళ్లలోపు వయస్సు ఉన్న ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపో కూడదు. ప్రతి తల్లి దండ్రులు తమ పిల్లలకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
  • ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందినప్పుడే ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది..
  • వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వా డీ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా కృషి చేయాలని సూచించారు.
  • అలాగే ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలం దరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై పోలియో రహి త సమాజ నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here