17.3 C
London
Wednesday, July 15, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ‘మట్టి నుంచి జనహృదయాల వరకు’ ప్రోమో ఆవిష్కరణ

ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ‘మట్టి నుంచి జనహృదయాల వరకు’ ప్రోమో ఆవిష్కరణ

0
  • పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన కానుకగా ప్రత్యేక వీడియో
  • పల్లా జీవన ప్రస్థానాన్ని ఆవిష్కరించే ప్రత్యేక వీడియో రేపు విడుదల
  • జనహృదయాల నాయకుడి ప్రస్థానంపై GB Tunes ప్రత్యేక వీడియో

జనగామ:

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మది నాన్ని(MLA Dr. Palla Rajeshwar Reddy’s birthday) పురస్కరించుకుని రూపొందించిన ప్రత్యేక వీడియోకు సంబంధించిన ప్రోమో పోస్టర్‌ను(the promo poster) శుక్రవారం ఆయన స్వయంగా ఆవిష్కరించి విడుదల చేశారు.

“మట్టి నుంచి జనహృదయాల వరకు-ఒక జననేత కథ” పేరుతో పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి వీరాభిమాని, జర్నలిస్ట్ బి. గణేష్ (GB Tunes)రచించి రూపొందించిన ఈ ప్రత్యేక వీడియో ప్రోమోను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా వీడియో రూపకర్త బి.గణేష్ మాట్లాడుతూ ఒక సాధారణ వ్యక్తిగా ప్రజల మధ్య సేవలు ప్రారంభించి, నేడు జనహృదయాల నాయకుడిగా ఎదిగిన డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి రాజకీయ, సామాజిక ప్రస్థానాన్ని ఈ ప్రత్యేక వీడియోలో తన ప్రయత్నంగా హృద్యంగా ఆవిష్క  రించినట్లు తెలిపారు. ప్రజలు, అభిమానులు, పార్టీ కార్య కర్తలు తప్పకుండా ఈ వీడియోను వీక్షించాలని ఆయన కోరారు.

కాగా, ఈ ప్రత్యేక వీడియో శనివారం సాయంత్రం GB Tun es Channelలో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here