- నవమాసాలు మోసి జన్మనిచ్చిన కుమారుడి 63వ జన్మదినాన్ని స్వగ్రామంలో ఘనంగా జరిపిన మాతృమూర్తి
- ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భావోద్వేగ క్షణాలు..
- అభిమానులను కదిలించిన తల్లి ఆశీర్వాదం
వేలేరు:
హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో శనివారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి 63వ జన్మ దినాన్ని (MLA Dr. Palla Rajeshwar Reddy’s 63rd birthday) పురస్కరించుకుని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే మాతృ మూర్తి అనసూయ (MLA’s mother, Anasuya) గారు ముఖ్య అతిథిగా హాజరై నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన కేక్‌ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.
నవమాసాలు గర్భంలో మోసి జన్మనిచ్చిన తల్లి చేతుల మీదుగా పుట్టినరోజు కేక్ కట్ చేయించడం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజల అభిమాన నాయకుడి గా ఎదిగిన తన కుమారుడి జన్మదినాన్ని స్వగ్రామ ప్రజల మధ్య జరుపుకుంటూ తల్లి ముఖంలో కనిపించిన ఆనం దం, గర్వం, ప్రేమ అక్కడున్న ప్రతి ఒక్కరినీ భావోద్వే గానికి గురిచేశాయి. ఆ క్షణాలు వేడుకల్లో మరపురాని అనుభూతి గా నిలిచాయి. అనంతరం బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే తల్లి అనసూయ గారికి శాలువా కప్పి ఘనంగా సత్కరించి ఆమె ఆశీర్వా దాలు పొందారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..ప్రజాసేవనే పర మావధిగా భావిస్తూ జనగామ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని పేర్కొన్నారు.
ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యేకు భగవంతు డు ఆయురా రోగ్యాలు, దీర్ఘాయుష్షు ప్రసాదించి మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని ఆకాం క్షించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి, ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

















