13.6 C
London
Monday, June 1, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం రోజరాణి..!

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం రోజరాణి..!

0
  • సమాజం ప్రశ్నించే గొంతును కోల్పోయింది
  • ఉద్యమం నుంచి సేవల దాకా ఆమె జీవితం ఆదర్శం
  • అవినీతి ఎదురించిన ధైర్యవంతురాలు
  • అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గని మహిళ రోజరాణి
  • ప్రజల కోసమే జీవించిన ఉద్యమకారిణి
  • రోజరాణి స్మరణ సభలో ఎమ్మెల్యే పల్లా భావోద్వేగ ప్రసంగం

హైదరాబాద్: కార్మిక ఉద్యమ నాయకురాలు కామ్రేడ్ రోజ రాణి(Comrede Rojarani )మరణం సమాజానికి తీరని లోటని జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన రోజరాణి స్మరణ సభలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా రోజరాణి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె సేవ లను స్మరించుకుంటూ భావోద్వేగంతో మాట్లాడారు. ఉద్య మం నుంచి ప్రజాసేవల దాకా రోజరాణి జీవితమంతా ఆదర్శప్రాయమని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యా యాల పై గళమెత్తిన ధైర్యవంతురాలని కొనియాడారు. అవినీతిని ఎదిరిస్తూ అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిలబడిన ఆమె నిజాయితీకి ప్రతీకగా నిలిచారని అన్నారు. రోజరాణి వంటి నాయకురాలు కోల్పోవడం సమాజానికి పెద్ద దెబ్బ. ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతు ఇక లేనట్టే అని ఎమ్మెల్యే పల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసమే జీవిం చిన ఉద్యమకారిణిగా ఆమె ఎప్పటికీ గుర్తుండిపో తారని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ పల్లా పాయింట్స్:

  • రోడ్డు ప్రమాదంలో రోజరాణి మృతి విషయం తెలిసిన వెంటనే ఎంతో కలచివేసింది.
  • ఉద్యమ నేపథ్యంలో పార్టీకి అంకితభావంతో పనిచేసిన ఆమె, నర్సుగా ప్రజలకు విశేష సేవలు అందించారని గుర్తుచేశారు.
  • అధికార బాధ్యతలు చేపట్టినప్పటికీ, ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకున్న నిబద్ధత గల నాయకురాలు.
  • తాను తీసుకున్న నిర్ణయాన్ని ఆశించే అధికారులు నిజాయితీతో పని చేయడం వల్లే ఆమెను టార్గెట్ చేయడం మొదలు పెట్టారని గుర్తు చేసారు.
  • 2014కు ముందు తీసుకున్న నిర్ణయాలపై తరువాత కూడా ఒత్తిళ్లు తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయని వెల్లడించారు.
  • సిరిసిల్లలో ఫ్యాకల్టీగా పనిచేసిన సమయంలో అన్యాయంగా ఇబ్బందులు పెట్టారని చెప్పారు.
  • ఆమెపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పటికీ నిజాయితీని గుర్తించి అప్పటి మంత్రి కే.టి. రామారావు తో మాట్లాడి సిరిసిల్ల నుంచి బదిలీ చేయించామని వివరించారు.
  • రోజరాణి కుటుంబం గురించి తనకు మంచి పరిచయం ఉంది. వారు ఎప్పుడూ తప్పు చేయరని నమ్మకం వ్యక్తం చేశారు.
  • ప్రొఫెసర్ ప్రమోషన్ రావడంలో కూడా అవరోధాలు సృష్టించినా, ఆమె నిబద్ధతకు గుర్తింపుగా ప్రమోషన్ సాధించారని చెప్పారు.
  • అప్పటి ఆరోగ్య మంత్రి టి.హరీష్ రావు తో చర్చించి ఆమెకు న్యాయం జరిగేలా కృషి చేశామని తెలిపారు.
  • ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని ప్రజల కోసం మాత్రమే పనిచేసిన వ్యక్తి రోజరాణి అని కొనియాడారు.
  • నిజాయితీ గల నర్సుగా, ప్రొఫెసర్‌గా తన వృత్తిలో ఎప్పుడూ అంకితభావంతో నిలిచారు.
  • సమాజంలో ప్రశ్నించే గొంతులు కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
  • అనంతరం రోజరాణి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యు లకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here