- అభివృద్ధి విషయంలో ఎలాంటి వెనుకడుగు ఉండదు
- అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి చేసిన జనగామ నియోజకవర్గం..!
ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
పేద ప్రజల కోసం ఎప్పటికీ కట్టుబడి పనిచేస్తాను. అభివృద్ధి విషయంలో ఎలాంటి వెనుకడుగు ఉండదని ఎమ్మెల్యే డాక్ట ర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం జనగామ టౌన్, జనగామ రూరల్, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాలకు చెందిన లబ్ధిదారులకు 18లక్ష ల8వేల విలు వైన 68 సీఎంఆర్ఎఫ్(CMRF) చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గ్రామాల్లో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని సూచించారు. అవసరమైతే నీలిమ హాస్పి టల్ సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పారు. నీలిమ హాస్పిటల్ ద్వారా డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నామని తెలి పారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి చేసిన నియోజకవర్గం జనగామేనని ఎమ్మెల్యే పల్లా తెలిపారు.

















