18.5 C
London
Friday, October 9, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ దసరా నాటికి తరిగొప్పుల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి..

దసరా నాటికి తరిగొప్పుల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి..

0
  • పనులు వేగవంతం చేసి దసరా కానుకగా రైతుల పొలాలకు నీరందించాలి.
  • మోటార్ల బిగింపు, విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు వేగవంతం చేయాలి.
  • ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్లు అందాలి
  • తరిగొప్పుల మండలంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
  • 17 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 

తరిగొప్పుల:

తరిగొప్పుల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం లో మంగళవారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు(Kalyana Lakshmi, Shaadi Mubarak  Beneficiaries)చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్బంగా  మండలానికి చెందిన 17 మంది లబ్ధిదా రులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..

  • ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses )రెండో విడత మొదటి జాబితాలో అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్లు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి రూపొందిం చిన జాబితాలోని L2, L3 కేటగిరీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిజమైన పేదలకు ఇళ్లు మంజూర య్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
  • తరిగొప్పుల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు(Lift Irrigation Works) చురుగ్గా కొనసాగుతున్నాయి. మోటార్లు చేరా యని, వాటి బిగింపు పనులతో పాటు అవసరమైన విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు కూడా కొనసాగుతున్నా  యని తెలిపారు. ఈ పనుల పురోగతిపై జివిఆర్ ఏజెన్సీ, ఇంజనీర్లు, ఇరిగేషన్, ఎలక్ట్రి కల్ అధికారులతో చర్చించినట్లు చెప్పారు.
  • ఎలక్ట్రికల్ ఇంజనీర్లు పనులను మరింత వేగవంతం చేయాలని సూచించామని, ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా నాటికి తరిగొప్పుల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, సంబంధిత అధికారులను కోరినట్లు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here