18.5 C
London
Friday, October 9, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ జనగామ గడ్డ పోరాటాలకు నిలయం..!

జనగామ గడ్డ పోరాటాలకు నిలయం..!

0
  • సర్దార్‌ సర్వాయి పాపన్న స్ఫూర్తితో పోరాట పంథా కొనసాగాలి
  • పాపన్న చరిత్రను భవిష్యత్‌ తరాలకు చాటిచెప్పాలి
  • జనగామ జిల్లాకు సర్దార్‌ సర్వాయి పాపన్న జిల్లాగా పేరు పెట్టాలి
  • కేసిరెడ్డిపల్లిలో సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా హాజరైన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి  

బచ్చన్నపేట:

జనగామ గడ్డ పోరాటాలకు నిలయమని(Jangaon land is a symbol of struggles)ఈ ప్రాంత ప్రజల్లో ఎంతో చైతన్యం ఉందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వ ర్‌రెడ్డి(Mla Palla Rajeswer Reddy)అన్నారు. బచ్చన్న పేట మండలం కేసిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం నిర్వ హించిన సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియా పాయింట్స్:

  • కేసిరెడ్డిపల్లి గ్రామస్తులు గతంలో చాకలి ఐలమ్మ విగ్రహావి ష్కరణకు తనను ఆహ్వానించిన విషయాన్ని గుర్తుచేశారు. గ్రామానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అందు బాటులో ఉంటానని తెలిపారు. గ్రామస్తులతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
  • జనగామ ప్రాంతం పోరాటాలకు నిలయమని, ఇక్కడి ప్రజ ల్లో ఎంతో చైతన్యం ఉందని అన్నారు. ఈ గడ్డపై జరిగిన అనేక పోరాటాలు, మహ నీయుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
  • సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ చరిత్ర ప్రతి ఒక్కరిలోనూ పోరాట స్ఫూర్తిని నింపుతుందన్నారు. సాధారణ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి న పాపన్న అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి సైన్యాన్ని ఏర్పాటు చేసి, అప్పటి బలమైన సామ్రా జ్యాన్ని ఎదురించి గోల్కొండ కోటపై తన జెండాను ఎగురవే సిన ధీశాలి అని కొనియాడారు.
  • సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ ఒక్క సామాజిక వర్గానికే పరిమిత మైన నాయకుడు కాదని, బహుజనులందరికీ స్ఫూర్తినిచ్చిన నాయకు డని పల్లా అన్నారు. పాపన్నతో పాటు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి మహనీ యుల పోరాట చరిత్రను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని సూచించారు.
  • దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి ఎందరో మహనీ యులు జనగామ నేల నుంచే పోరాట స్ఫూర్తిని చాటారని అన్నారు. వేలాది మంది అమరుల త్యాగాల ఫలితంగా భూమి పంపిణీ జరిగింది. ప్రజల్లో పోరాట చైతన్యం పెరిగిం  దని గుర్తుచేశారు.
  • జనగామ జిల్లాలోని ప్రతి గ్రామానికి పోరాటాల చరిత్ర ఉంద ని పల్లా పేర్కొన్నారు. పోరాట సమయంలో నిరాశ, ఇబ్బం  దులు ఎదురైనప్పుడు జనగామ గడ్డను ఒకసారి తలు చుకుంటే తిరిగి పోరాట స్ఫూర్తి వస్తుందన్నారు.
  • గత పాలకులు అనేక పోరాటాల చరిత్రను ప్రజలకు తెలి యకుండా చేశారని అన్నారు. 1969 తెలంగాణ విద్యార్థుల పోరాట చరిత్రతో పాటు పలువురు పోరాట యోధుల చరిత్రను కూడా మరుగునపరిచార ని పేర్కొన్నారు.
  • వాస్తవ చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చి భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నా రు. సర్దార్‌ సర్వాయి పాపన్న వంటి మహనీయుల చరిత్రను ప్రజలకు తెలియజేయడంతో పాటు, వారి విగ్రహాలను ఏర్పాటు చేసి వారి ఆశయాలను గుర్తు చేసు కోవడం అభినందనీయమన్నారు.
  • తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌడ సోదరులకు ఉపాధి కల్పించేలా నిలిచిపోయిన కల్లు దుకాణాలను పునరు ద్ధరించినట్లు పల్లా గుర్తుచేశారు. కల్లుగీత కార్మికులు ప్రమా  దవశాత్తు మృతి చెందినా, వైకల్యానికి గురైనా అందించే పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు తెలిపారు.
  • ఎక్సైజ్‌ శాఖ పరిధిలోని వ్యాపారాలు, దుకాణాల కేటాయిం  పుల్లో గౌడ సామాజిక వర్గానికి 15 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు పేర్కొన్నా రు. గౌడ సోదరుల సంక్షేమం, ఉపా ధి కోసం గతంలో తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.
  • ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో గౌడ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని పల్లా డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా జనగామ జిల్లాకు సర్దార్‌ సర్వాయి పాప న్న జిల్లాగా పేరు మార్చు తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు.
  • గౌడ సోదరులు ప్రస్తావించిన కల్లు సొసైటీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పల్లా హామీ ఇచ్చారు. గౌడ సమాజం తరఫున ఏ సమస్య వచ్చినా జిల్లా స్థాయిలో ప్రాతినిధ్యం వహించడంతో పాటు, అవసరమైతే అసెంబ్లీలో గళం విప్పుతానని అన్నారు.
  • తాను అందరివాడినైన నాయకుడినని, గౌడ సమాజం ఎదుర్కొం టున్న సమస్యలను తన సొంత సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. సర్దార్‌ సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి మహనీయుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here