22.3 C
London
Monday, August 31, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ రైతుల సాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యం..!

రైతుల సాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యం..!

0
  • దసరా నాటికి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం.
  • అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
  • సాగునీరు, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత
  • తరిగొప్పుల మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి 

తరిగొప్పుల:

తరిగొప్పుల మండలంలోని బొత్తలపర్రె, జాలుబాయితండా, బోజ్య తండా, కొత్త తండా గ్రామాల్లో వీఓ భవనాల నిర్మాణ పనులకు(For construction work of VO buildings) సోమవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా ఆయా గ్రామాల ప్రజలు, రైతులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.

ఎమ్మెల్యే పల్లా మీడియా పాయింట్స్:

  • ఎత్తుగడ్డ ప్రాంతాల్లో ఉన్న బొత్తలపర్రె, జాలుబాయితండా గ్రామా లకు సాగునీరు అందించేందుకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పను లు చేపడుతున్నాం.
  • ఎత్తైన ప్రాంతాలకు పైప్‌లైన్ల ద్వారా నీటిని తీసుకెళ్లే సమ యంలో ఎదురవుతున్న సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తాం.
  • లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు సంబంధించిన మోటార్లు, పైప్‌లైన్లు, విద్యుత్‌ అనుసంధాన పనులను వేగవంతం చేస్తాం.
  • రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకుంటాం.
  • దసరా నాటికి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు పూర్తి చేసి పంట పొలాలకు నీరు అందించడమే లక్ష్యం.
  • సాగునీరు అందుబాటులోకి వస్తే నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
  • సాగునీరు అందించి రైతులు పంటలను కాపాడుకునేలా చర్యలు తీసుకుంటాం.
  • గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం.
  • రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.
  • అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
  • ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతోంది.
  • మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకుంటే ప్రభుత్వ నిధులు కూడా త్వరగా విడుదల అవుతాయి.
  • మొదటి, రెండో విడతల అనంతరం మిగిలిన అర్హులైన పేదలకు మూడో, నాలుగో విడతల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తా..
  • గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, పేదల సొంతింటి కల నెరవే ర్చేందుకు నిరంతరం కృషి చేస్తా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here