- దసరాకు నీళ్లు అందించిన తర్వాతే మళ్లీ గ్రామానికి వస్తా..
- 15 గ్రామాల చెరువులను నింపే బాధ్యత నాదే
- అభివృద్ధిలో రాజకీయాలకు తావులేదు
- రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దాం
- పేదల ఇళ్ల నిర్మాణానికి మట్టి తరలింపుపై జరిమానాలు సరికాదు
- ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే గ్రామాభివృద్ధి సాధ్యం
- తరిగొప్పుల ప్రాంతంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం
- అంకుశాపూర్, సోలిపురంలో వీఓ భవనాలకు శంకుస్థాపన
- ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
తరిగొప్పుల:
తరిగొప్పుల మండలంలోని అంకుశాపూర్, సోలిపురం గ్రామాల్లో వీఓ భవనాల నిర్మాణ పనులకు(For construc tion work of VO buildings) సోమవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ రై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో చేప డుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

- గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తున్నాం. ఏ పార్టీకి చెందిన వారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా గ్రామాభివృద్ధి కోసం ముందుకు వస్తే వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. గ్రామంలో విభేదాలకు తావులేకుండా ప్రజలంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధించాలని సూచించారు.
- స్థానిక సర్పంచ్, ఉపసర్పంచ్, సీనియర్ నాయకులు, పాలక వర్గ సభ్యులు, గ్రామ ప్రజలంతా సమన్వయంతో పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
- గ్రామాభివృద్ధి కోసం బాలరాజ్‌తో కలిసి పనిచేస్తామని, ఎన్ని కలకు ముందే గ్రామంలో విభేదాలు లేకుండా అందరూ సుఖసంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఆయనకు మద్ద తుగా నిలిచామని తెలిపారు.
- తరిగొప్పుల ప్రాంతం ఎత్తైన ప్రదేశంలో ఉండటం వల్ల చుట్టు పక్కల నర్మెట్ట, జనగామ, బచ్చన్నపేట ప్రాంతాలకు నీరు అందుతున్నప్పటికీ, తరిగొప్పుల పరిధిలోని 14 లేదా 15 గ్రామాలు, తండాల్లో సాగు, తాగు నీటి సమస్య కొనసాగు తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దే శంతో గతంలో కేటీఆర్‌తో కలిసి రూ.104 కోట్లతో ఎత్తిపో తల పథకానికి శంకుస్థాపన చేసినట్లు గుర్తుచేశారు.
- ప్రస్తుతం 15 గ్రామాలతో పాటు అంకుశాపూర్ గ్రామానికి పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. లిఫ్ట్ ఇరిగేష న్‌కు సంబంధించిన మోటార్లు, స్లాబ్‌లు, భవన నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. మోటార్ల ఫిట్టింగ్ పనులు నెలలోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని, విద్యుత్ కనెక్షన్ పనులను కూడా వేగవంతం చేసి రాబోయే దసరా పండుగ నాటికి అంకుశాపూర్‌కు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.
- కాల్వల ద్వారా కాళేశ్వరం నీటిని తీసుకువచ్చి అంకుశాపూ ర్‌తో పాటు చుట్టుపక్కల 15 గ్రామాల చెరువులను కూడా నింపే బాధ్యతను తాను తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నీళ్లు అందించిన తర్వాతే మళ్లీ గ్రామానికి వస్తా నని స్పష్టం చేశారు.
- గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్య క్రమం ద్వారా పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగింది. కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి అద్దాలు, వైద్య సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నా రు. వృద్ధుల్లో వయసు పెరిగే కొద్దీ చూపు మందగించడం వల్ల ఇబ్బం దులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
- తాము ఇచ్చిన మాట ప్రకారం నీలిమ ఆస్పత్రులో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కూడా ఈ వైద్య సేవలను నిరంతరం కొనసా గించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
- గ్రామాలకు అవసరమైన రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పను లకు నిధులు మంజూరు చేయించినప్పటికీ, పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం సమస్య గా మారిందన్నారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చిన్నచిన్న పనులను సర్పంచులు తమ పరిధిలోనే పూర్తి చేస్తున్నారని చెప్పారు.
- గ్రామాభివృద్ధికి సంబంధించిన సమస్యలను అధికారులతో, ఎంపీ డీవోతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. స్థలం అందుబాటులో ఉంటే అదనంగా రూ.10 లక్షల నిధులు సమకూర్చి మహిళా భవనం, సమాఖ్య భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
- అంకుశాపూర్ గ్రామానికి హుస్నాబాద్ నుంచి బస్సు సౌక ర్యం కల్పించాలని ప్రజలు కోరుతూ స్థానిక నాయకుడు బాలరాజ్ ఇప్పటికే హుస్నాబాద్ డిపో మేనేజర్‌తో మాట్లాడి బస్సు సౌకర్యం కోసం ప్రయ త్నాలు చేశారని తెలిపారు. హుస్నాబాద్‌తో పాటు జనగామ నుంచి కూడా బస్సు సౌకర్యం కల్పించేలా త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
- అంకుశాపూర్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే తెలిపారు. నిధులు వచ్చిన వెంటనే పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సూచించారు.
- పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ సొంత పట్టా భూమి నుంచి ఇళ్ల నిర్మాణం కోసం మట్టిని తీసుకెళ్లే సమయంలో సొంత ట్రాక్టర్లు, సొంత మనుషులతో మట్టి తరలిస్తున్నప్ప టికీ వేల రూపాయల జరిమానాలు విధించడం సరికాద న్నారు. ఈ సమస్యపై ఇప్పటికే సంబంధిత మంత్రి, అధికా రులతో మాట్లాడినట్లు తెలిపారు.
- ఇసుక, మట్టి వంటి ప్రాథమిక వనరులు ప్రజలకు ఇబ్బందు లు లేకుండా అందుబాటులో ఉండేలా, ఇళ్ల నిర్మాణం చేసు కునే పేదలకు సహకరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
- గ్రామాభివృద్ధికి ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చి అంకుశాపూర్, సోలిపురంతో పాటు తరిగొప్పుల ప్రాంతంలోని అన్ని గ్రామా లను అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

















