- దసరా నాటికి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం.
- అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
- సాగునీరు, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత
- తరిగొప్పుల మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
తరిగొప్పుల:
తరిగొప్పుల మండలంలోని బొత్తలపర్రె, జాలుబాయితండా, బోజ్య తండా, కొత్త తండా గ్రామాల్లో వీఓ భవనాల నిర్మాణ పనులకు(For construction work of VO buildings) సోమవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా ఆయా గ్రామాల ప్రజలు, రైతులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే పల్లా మీడియా పాయింట్స్:
- ఎత్తుగడ్డ ప్రాంతాల్లో ఉన్న బొత్తలపర్రె, జాలుబాయితండా గ్రామా లకు సాగునీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ పను లు చేపడుతున్నాం.
- ఎత్తైన ప్రాంతాలకు పైప్లైన్ల ద్వారా నీటిని తీసుకెళ్లే సమ యంలో ఎదురవుతున్న సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తాం.
- లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించిన మోటార్లు, పైప్లైన్లు, విద్యుత్ అనుసంధాన పనులను వేగవంతం చేస్తాం.
- రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకుంటాం.
- దసరా నాటికి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి పంట పొలాలకు నీరు అందించడమే లక్ష్యం.
- సాగునీరు అందుబాటులోకి వస్తే నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
- సాగునీరు అందించి రైతులు పంటలను కాపాడుకునేలా చర్యలు తీసుకుంటాం.
- గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం.
- రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.
- అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
- ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతోంది.
- మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకుంటే ప్రభుత్వ నిధులు కూడా త్వరగా విడుదల అవుతాయి.
- మొదటి, రెండో విడతల అనంతరం మిగిలిన అర్హులైన పేదలకు మూడో, నాలుగో విడతల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తా..
- గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, పేదల సొంతింటి కల నెరవే ర్చేందుకు నిరంతరం కృషి చేస్తా..

















