- దాడి ఘటనపై వినయ్ భాస్కర్‌ను పరామర్శించిన పల్లా
- ఘటనకు దారితీసిన పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
- ప్రజా సమస్యలను ప్రశ్నించినందుకు దాడి చేయడం దారుణం
- ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
హన్మకొండ:
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Mla Palla Rajeswer Reddy)గురువారం హన్మకొండలోని మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. వరంగల్ ఎంజీఎం ఆసు పత్రి దుస్థితిని ప్రశ్నించే (Wara ngal MGM Hospital Police Attack)క్రమంలో జరిగిన పోలీసుల దాడిలో గాయపడిన వినయ్ భాస్కర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులు, పోలీ సులు వ్యవహరించిన తీరుపై వినయ్ భాస్కర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంజీ ఎం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను ప్రశ్నించినం దుకు ప్రజాప్రతినిధిపై పోలీసులు దాడి చేయడం దారుణమన్నా రు. ప్రజా సమస్యలను ప్రశ్నించే నాయకులపై పోలీసుల తో దాడులు చేయించడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమన్నారు.
పోలీసుల అత్యుత్సాహాన్ని అరికట్టి ఘటనపై సమగ్ర విచా రణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను ప్రశ్నించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని, ప్రశ్నించే గొంతులను అణచివేయడం సాధ్యం కాదని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

















