- వారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
వరంగల్:
ప్రముఖ విద్యావేత్త, తాళ్ల పద్మావతి విద్యాసంస్థల వ్యవ స్థాపక చైర్మన్(Tall Padmavathi Educational Institut ion) తాళ్ల మల్లేశం మృతి పట్ల జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Mla Palla Rajeswer Reddy) సంతాపం వ్యక్తం చేశారు.
గురువారం వరంగల్‌లోని తాళ్ల మల్లేశం నివాసానికి ఎమ్మె ల్యే పల్లా వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. విద్యా రంగంలో తాళ్ల మల్లేశం అందించిన సేవలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్మరించుకున్నారు. ఆయన మృతి విద్యా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.

















