- అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక.. వీరనారి చాకలి ఐలమ్మ
- నిజాం, రజాకార్ల అణచివేతకు ఎదురొడ్డి నిలిచిన ధీరవనిత ఐలమ్మ
- ఐలమ్మను ఒక కులానికే పరిమితం చేయొద్దు.. సమాజం కోసం పోరాడిన మహనీయురాలు
- తెలంగాణ సాయుధ పోరాటంలో 4 వేల మంది అమరు లు..20 లక్షల ఎకరాల భూమి పంపిణీ
- బైరాన్‌పల్లి వీరుల త్యాగం తెలంగాణ పోరాట చరిత్రలో చిరస్మరణీయం
- చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలి
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
బచ్చన్నపేట మండలం కేసిరెడ్డి పల్లి గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి (Jayanti)సందర్భంగా శనివారం నిర్వహించిన విగ్రహావిష్కరణ(Statue Inauguration) కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Janagama Mla Palla) ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మె ల్యే ఆవిష్కరించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు.
ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా పాయింట్స్:
- తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం చిరస్మరణీయం.
- తొలి అమరుడు దొడ్డి కొమరయ్య..తొలి మహిళా పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ..
- నిజాం, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా ఐలమ్మ ధైర్యంగా ఎదిరించి పోరాడారు.
- భూమి, హక్కులు, సమానత్వం, ఆత్మగౌరవం కోసం అణగా రిన వర్గాల ప్రజలు సాగించిన పోరాటంలో ఐలమ్మ కీలక స్ఫూర్తిగా నిలిచారు.
- తెలంగాణ సాయుధ పోరాటంలో సుమారు 4 వేల మంది అమరులయ్యారు.. 20 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగింది.
- తెలంగాణ సాయుధ పోరాటానికి జనగామ ప్రాంతం గర్భగుడిగా నిలిచింది..ఈ గడ్డ నుంచే పోరాట స్ఫూర్తి విస్తరించింది.
- చాకలి ఐలమ్మను కేవలం ఒక కులానికో, సామాజిక వర్గానికో పరిమితం చేయడం ఆమె పోరాట చరిత్రను చిన్నచూపు చూడటమే.
- అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం మొత్తం సమాజానికి స్ఫూర్తిదాయకం.
- బైరాన్‌పల్లి, కూటిగల్లు తదితర ప్రాంతాల్లో ప్రజలు నిజాం, రజాకార్ల అణచివేతను ఎదుర్కొని పోరాడారు.
- బైరాన్‌పల్లి ఘటనలో 130 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషాద చరిత్రను ఎప్పటికీ మర్చిపోవద్దు.
- 1946 నుంచి 1948 వరకు సాగిన ప్రజా పోరాటాలు తెలంగాణ చరిత్రలో కీలక ఘట్టాలు.
- ఎలాంటి అణచివేత ఎదురైనా వెనుకడుగు వేయకుండా పోరాడిన చాకలి ఐలమ్మ ధైర్యం నేటి తరానికి ఆదర్శం.
- వీరనారి చాకలి ఐలమ్మ త్యాగాలను స్మరించుకో వడంతో పాటు ఆమె పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలి.

















