- పెండింగ్ పనులు పూర్తి చేసి మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాలి
- గతంలో మంజూరైన రూ.25 కోట్లు, ఎన్నికల సమయంలో మంజూరైన రూ.18.9 కోట్లను వెంటనే విడుదల చేయాలి
- రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
- షామీర్పేట అప్రోచ్ రోడ్డుకు తక్షణమే నిధులు మంజూరు చేయాలి
- గండిరామారంలో వరద నీటిలో మునిగిన పంపులను మరమ్మతు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలి.
- అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలి
- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి అవసరమైన మేరకు అదనపు నిధులు కేటాయించాలి
- మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే పల్లా వినతి
జనగామ:
జనగామ జిల్లాలో రాష్ట్ర గృహ నిర్మాణం, రెవెన్యూ, సమా చార పౌరసం బంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా జనగామ మున్సిపల్ కార్యాల యంలో రూ.1.77 కోట్ల విలువైన 16 నూతన చెత్త సేకరణ ఆటోలు, జేసీబీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సి పాలిటీ పరిధిలో 54 మంది శానిటరీ వర్కర్లు, ఎలక్ట్రీషియ న్లు, డ్రైవర్లకు నియామక పత్రాలను అందజేశారు.
అనంతరం మున్సిపల్ డంపింగ్ యార్డ్ షెడ్, మెషినరీ, మురుగు నీటి శుద్ధి ప్లాంట్‌తో పాటు పలు అభివృద్ధి పనుల కు శంకుస్థాపనలు నిర్వహించారు. అలాగే జనగామ మున్సి పాలిటీ పరిధిలో 99 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధి దారుల గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. 500 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా జనగామ మున్సిపాలిటీ, నియోజకవర్గ అభివృద్ధికి సంబం ధించిన పలు అంశాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా పాయింట్స్:
- జనగామ మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసి పెండింగ్ పనులను పూర్తి చేయాలి.
- రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు తదితర మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
- గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో ఇందిరానగర్‌తో పాటు మున్సిపాలిటీ పరిధిలోని మూడు వార్డులకు మంజూ రైన రూ.25 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలి.
- ఎన్నికల సమయంలో మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూ రైన రూ.18.9 కోట్ల నిధులను వెంటనే విడుదల చేసి పనులు ప్రారంభించాలి.
- ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి జనగామ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
- గత మూడేళ్లుగా మున్సిపాలిటీ నిధుల కొరతను ఎదుర్కొం టోంది. అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు అవసరం.
- కలెక్టర్, డీఎంఎఫ్టీ నిధులతో ప్రస్తుతం జరుగుతున్న పను లకు అదనంగా మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయిం చాలి.
- వడ్లకొండ పరిధిలోని షామీర్పేట వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున సుమారు కిలోమీటర్ మేర అప్రోచ్ రోడ్డు నిర్మించాలి.
- షామీర్పేట అప్రోచ్ రోడ్డుకు ఆర్అండ్బీ లేదా సంబంధిత శాఖ ద్వారా వెంటనే నిధులు మంజూరు చేయాలి.
- చిటకోడూరు మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు గండిరామారం ప్రాంతంలో నెలకొన్న వరద నీటి సమస్యను పరిష్కరించాలి.
- గండిరామారంలోని నాలుగు పంపుల్లో వరద నీటిలో మునిగిన రెండు పంపులను వెంటనే మరమ్మతు చేయాలి.
- పంపుల మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలి.
- ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను రాజకీయాలకు అతీతంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలి.
- మొదటి విడతలో మిగిలిన ఇందిరమ్మ ఇళ్లతో పాటు రెండో విడతలో కేటాయించిన ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి.
- జనగామ పట్టణంలో ఇప్పటికే నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇంకా అవసరమైన ఇళ్లకు నిధులు మంజూరు చేయాలి.
- నియోజకవర్గంలో అవసరమైన ఇందిరమ్మ ఇళ్లు, ఇతర అభివృద్ధి పనులకు తగినన్ని నిధులు కేటాయించాలి.

















