- నర్మెట్ట మండలంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
- 14 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
నర్మెట్ట:
నర్మెట్ట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధి దారులకు చెక్కుల పంపిణీ (Cheques Distribution) కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నర్మెట్ట మండలానికి చెందిన 14మంది లబ్ధిదారులకు(14 Beneficiaries)కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwer Reddy) అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..
- పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు ఎంతో తోడ్పాటు నిస్తున్నాయని అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పథకాల ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
- సంక్షేమ పథకాల విషయంలో రాజకీయాలకు తావు లేకుం డా అర్హత ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రయో జనాలు అందించాలని అన్నారు.
- కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆడబిడ్డల వివాహ సమ యంలో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.
- లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా దరఖాస్తుల పరిశీలన, పథకాల అమలును అధికారులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

















