15.2 C
London
Monday, June 1, 2026
Home ప్రజా సమస్యలు పల్లా పిలుపే ప్రజా ఉద్యమం!

పల్లా పిలుపే ప్రజా ఉద్యమం!

0
  • ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాలతో బెల్ట్ షాపులపై కఠిన చర్యలకు శ్రీకారం
  • 11వ వార్డు ప్రజలు, మహిళలు ఏకగ్రీవంగా ముందుకు…అక్రమ మద్యంపై ‘’నో’ చెప్పిన కాలనీ
  • మద్యానికి దూరం…కుటుంబానికి ధైర్యం నినాదంతో వాడవాడలా చైతన్యం

జనగామ:

జనగామ పట్టణంలో అక్రమ బెల్ట్ షాపులపై పోరాటం కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి (Janagaon Mla Palla Rajeswer Reddy)ఇచ్చిన పిలుపుతో 11వ వార్డు ప్రజలు సమరానికి సిద్ధమయ్యారు. ఆయన సూచనలతో ప్రజల్లో చైతన్యం పెరగడంతో మహి ళలు ముందుండి బెల్ట్ దుకాణాల మూసివేతకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. వార్డు కౌన్సిలర్ ఎనగందుల అనూషకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మహిళా సంఘాలు, స్థానికులు బెల్ట్ షాపుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తీవ్రంగా ప్రస్తావించారు. ఇళ్ల మధ్యలో నడుస్తున్న ఈ అక్ర మ మద్య దుకాణాలు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపు తున్నాయని తెలిపారు. యువత మద్యానికి బానిసవు తుండటంతో సామాజిక పరిస్థితులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పల్లా పిలుపును ప్రజలు బలంగా స్వీకరించారు. తమ వార్డులో ఉన్న అన్ని బెల్ట్ షాపులను మూసి వేయాలని నిర్ణయించి అమలు దిశగా అడుగులు వేశారు. ఇప్పటికే కొన్ని దుకాణా లు మూసివేయించగా, మిగిలిన వాటిపై కఠిన నిఘా కొనసాగుతోంది.

  • పల్లా దిశానిర్దేశంతో వాడవాడలా చైతన్యం:

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దిశానిర్దేశంతో మద్యానికి దూరం…కుటుంబానికి భద్రత అనే లక్ష్యంతో మహిళా సంఘాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఉద్యమం కేవలం ఒక వార్డుకే పరి మితం కాకుండా జిల్లావ్యాప్తంగా విస్తరించేలా ప్రజల్లో ఉత్సా హం కనిపిస్తోంది. పల్లా పిలుపుతో మొదలైన ఈ పోరాటం అక్రమ మద్యంపై ప్రజలే నాయకులుగా మారిన అరుదైన ఉద్యమంగా మారుతుండగా ఇది జిల్లాకు ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here