- పల్లా గ్రామాల పర్యటనలతో వేగం పెంపు
- జనగామ ఎమ్మెల్యే విస్తృతంగా గ్రామాల్లో పర్యటనలు
- కేసీఆర్ సభ విజయం ఖాయం…కాంగ్రెస్ పతనం ఖాయం
- కేసీఆర్ రావాలి…రేవంత్ పోవాలి నినాదాన్ని ప్రతి ఇంటికి చేర్చాలి: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపు
జగిత్యాల:
జగిత్యాలలో ఈనెల 20న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (BRS ADHINETHA KCR BAHIRANGA SABHA) జైత్రయాత్ర బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ జన సమీక రణను వేగవంతం చేస్తున్నారు. ప్రతి గ్రామానికి వెళ్లి నాయ కులు, కార్యకర్తలను ఆప్యాయంగా కలుస్తూ సభ ప్రాముఖ్య తను వివరిస్తున్నారు.
- కార్యకర్తలకు భరోసా…ఉత్సాహం నింపుతున్న పల్లా:
గ్రామ పర్యటనల సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి కార్య కర్తలతో సన్నిహితంగా మాట్లాడి, పార్టీ బలాన్ని మరింత పెంచేలా మార్గనిర్దేశం చేస్తున్నారు. కేసీఆర్ రావాలి…రేవంత్ పోవాలి అనే నినాదాన్ని ప్రతి ఇంటికి చేర్చాలని పిలుపుని స్తున్నారు. కార్యకర్తలకు పూర్తి భరోసా ఇస్తూ సభను విజ యవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావా లని కోరుతున్నారు.
- జగిత్యాల జైత్రయాత్రకు గ్రామాల నుంచి భారీ స్పందన:
జనగామ ఎమ్మెల్యే పల్లా పర్యటనలతో గ్రామ స్థాయిలో భారీ స్పందన వ్యక్తమవుతోంది. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి సభ ఏర్పాట్లలో చురుకుగా పాల్గొంటున్నారు. జగిత్యాల నుంచి ప్రారంభమయ్యే ఈ జైత్రయాత్ర బీఆర్‌ఎస్‌కు కొత్త ఊపును తీసుకువస్తుందని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి.
- జగిత్యాల సభను చారిత్రాత్మకంగా నిలపాలి: జనగామ ఎమ్మెల్యే పల్లా
జగిత్యాల సభను చారిత్రాత్మకంగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామ ని, లక్షలాది మంది హాజరయ్యేలా సమన్వ యం జరుగుతోందని ఎమ్మెల్యే పల్లా తెలిపారు. గ్రామాల నుంచి భారీగా తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ జైత్రయాత్ర తెలంగాణ రాజకీయాల్లో మలుపు తిప్పే సభ గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

















